February 28: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్.ఐ.సీ పాలసీలను తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఎల్.ఐ.సీ పాలసీలను కలిగి ఉన్నవాళ్లు పాలసీతో పాన్ కార్డ్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవాలి. ఎల్.ఐ.సీ పాలసీలను కలిగి ఉన్నవాళ్లు ఐపీవోలో పాల్గొనాలని భావిస్తే కచ్చితంగా ఈ వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నెలాఖరు లోపు వివరాలను అప్ డేట్ చేసుకోవడం ద్వారా సులభంగా ఎల్.ఐ.సీ ఐపీవోలో పాల్గొనవచ్చు. మరోవైపు పెన్షన్ ను పొందేవాళ్లు తప్పనిసరిగా ఈ నెలాఖరు నాటికి జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలి. లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించడానికి కేంద్రం ఇప్పటికే పలుమార్లు డేట్ ను మార్చిన విషయం తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది.
Also Read: భీమ్లా నాయక్ పోస్టర్ వైరల్.. ఆ ఫొటో వెనుక కథేంటి?
లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పిస్తే మాత్రమే పెన్షన్ ను పొందే అవకాశం కలుగుతుందని చెప్పవచ్చు. ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత లైఫ్ సర్టిఫికెట్ ను అందించడం వల్ల పెన్షన్ ను పొందడానికి అర్హతను కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తేదీ పెన్షన్ ను పొందడానికి చివరితేదీగా ఉంటుంది. అయితే గతేడాది నవంబర్ 30వ తేదీకి చివరి తేదీగా ఉండగా కరోనా మహమ్మారి వల్ల డేట్ లో మార్పు జరిగింది.
లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించని పక్షంలో పెన్షన్ ఆగిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎల్.ఐ.సీ పాలసీదారులు, పెన్షన్ దారులు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
Also Read: యాడ్స్ ద్వారా మహేష్ సంపాదన ఎంత..? ఆ మొత్తం ఏం చేస్తాడో తెలుసా?
వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్.. డబ్బు కోసమే తమన్నా ఆరాటం
Recommended Video: