https://oktelugu.com/

Manchu Vishnu: టంగుటూరి వీరేహం బకాహం పంతులు అంటే.. ట్రోలింగ్ చెయ్యరా ?

Manchu Vishnu: మంచు ఫ్యామిలీ ప్రస్తుతం తమను ట్రోల్ చేస్తున్న వారి పై యుద్ధానికి దిగారు. లీగల్ గా ముందుకు వెళ్తామని మంచు విష్ణు తాజాగా ఒక లేఖను కూడా వదిలాడు. అయితే, అసలు మంచు ఫ్యామిలీని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ? అసలు కారణం ఏమిటో చూద్దాం. ఇద్దరు లేదా నలుగురు మధ్యలో ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు పొరపాటున కొన్ని పదాలను తప్పుగా ఉచ్చరిస్తే.. కామెడీగానే ఉంటుంది. తప్పుగా ఉచ్చరించే పదాలు ఆ వ్యక్తి గౌరవాన్ని […]

Written By:
  • Shiva
  • , Updated On : February 19, 2022 / 05:03 PM IST
    Follow us on

    Manchu Vishnu: మంచు ఫ్యామిలీ ప్రస్తుతం తమను ట్రోల్ చేస్తున్న వారి పై యుద్ధానికి దిగారు. లీగల్ గా ముందుకు వెళ్తామని మంచు విష్ణు తాజాగా ఒక లేఖను కూడా వదిలాడు. అయితే, అసలు మంచు ఫ్యామిలీని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ? అసలు కారణం ఏమిటో చూద్దాం. ఇద్దరు లేదా నలుగురు మధ్యలో ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు పొరపాటున కొన్ని పదాలను తప్పుగా ఉచ్చరిస్తే.. కామెడీగానే ఉంటుంది.

    Manchu Vishnu

    తప్పుగా ఉచ్చరించే పదాలు ఆ వ్యక్తి గౌరవాన్ని పోగొడతాయి. పైగా టెలివిజన్ మాధ్యమాలలో నోటికి వచ్చినట్టు లేదా నోరు తిరగని దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అందరూ హేళన చేస్తారు. అదేవిధంగా గొప్ప వ్యక్తుల పేర్లను తప్పుగా పలికితే హేళన చేస్తారు. ఆ మధ్య ఒక రాజకీయ నాయకుడు బీకాం లో ఫిజిక్స్ ఉంది అంటే జనాలందరూ నవ్వుకున్నారు. అలాగే మంచు విష్ణు కూడా బుక్ అయ్యాడు, నవ్వులపాలు అయ్యాడు.

    Also Read:  ‘ప్రభాస్ – మారుతి’ సినిమాలో నటించే హీరోయిన్స్ వాళ్లే

    కాగా కందుకూరి వీరేశలింగం గారు సంఘ సంస్కర్త. టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు నుంచి విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. అయితే, మంచు విష్ణు ఈ రెండు పేర్లునీ మిక్స్ లో వేసి ఒక తిప్పు తిప్పాడు. ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం బాబ్జీలకు మరియు విప్ బాబ్జీలకు పూర్తిగా తెలుగు రాదు కాబట్టి అర్థం కాలేదు.

    అయినా.. భవిష్యత్తులో టంగుటూరి వీరేహం బకాహం పంతులు అనే పేరుతో సినిమా కూడా తీయవచ్చు. ఆ స్థాయికి మన తెలుగు సమాజం దిగజారిపోయేలా ఉంది అనుకోండి. ఏది ఏమైనా మంచు విష్ణు ఇలా ఇష్టం వచ్చినట్టు పలికి కామెడీ పాలు అయ్యాడు. కాబట్టి.. మంచు విష్ణును ట్రోల్ చేశారు.

    అయినా టంగుటూరి వీరేహం బకాహం పంతులు అంటే ఎందుకు ట్రోల్ చెయ్యకూడదు !! ఇప్పటికైనా మంచు విష్ణు ట్రోలింగ్ కి అసలైన కారణాన్ని వెతుక్కుంటే మంచిది. లేకపోతే.. కింద విడుదల చేసినట్లు ప్రెస్ నోట్లను రోజుకొకటి రిలీజ్ చేయాల్సి వస్తోంది.

    Also Read:  ఆ హీరోయిన్ పడిపోయిందనే స్థితిలోనే మళ్ళీ లేస్తోంది !

    Recommended Video:

    Tags