https://oktelugu.com/

Prabhas Maruthi Movie: ‘ప్రభాస్ – మారుతి’ సినిమాలో నటించే హీరోయిన్స్ వాళ్లే

Prabhas Maruthi  Movie: నేషనల్ స్టార్ ప్రభాస్ చేతుల్లో దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. అయినప్పటికీ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతితో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్‌ తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ సరసన మాళవిక మోహన్ హీరోయిన్‌ గా నటించే అవకాశం ఉందనే వార్త కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తమిళంలో మాస్టర్ మూవీతో […]

Written By:
  • Shiva
  • , Updated On : February 19, 2022 / 04:32 PM IST

    Prabhas Maruthi

    Follow us on

    Prabhas Maruthi  Movie: నేషనల్ స్టార్ ప్రభాస్ చేతుల్లో దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. అయినప్పటికీ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు మారుతితో ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్‌ తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    Prabhas Maruthi Movie

    ప్రభాస్ సరసన మాళవిక మోహన్ హీరోయిన్‌ గా నటించే అవకాశం ఉందనే వార్త కూడా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తమిళంలో మాస్టర్ మూవీతో మాళవిక మోహన్‌ హిట్ అందుకుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ త్వరలో రానుంది. కానీ, ప్రభాస్ మారుతితో సినిమా చేయడానికి ఆల్ రెడీ సైన్ చేశాడట.

    Also Read:  మంచు ఫ్యామిలీని ట్రోల్ చేయడానికి కారణాలు ఇవే

    మారుతి ఏమి చేసినా బిజినెస్ పరంగా మంచి లాభాలు వచ్చే విధంగా చేస్తాడు. పైగా నిర్మాతలకు లాభాలు వచ్చే సినిమాలే చేస్తాడు. అందుకే ప్రభాస్ మారుతికి ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు. అన్నిటికీ మించి కింద స్థాయి నుంచి రావడంతో మారుతికి మాస్ పల్స్ బాగా తెలుసు.

    అందుకే, మారుతితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా సముఖంగా ఉంటున్నారు. ఇక ప్రభాస్ – మారుతి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. తమిళ స్టన్నింగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఒక హీరోయిన్ గా నటిస్తుంటే.. మరో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది.

    Prabhas

    ఇక డైరెక్టర్ గా మారుతి బాగా సక్సెస్ అయినా.. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో డేట్స్ ఇవ్వలేదు. ఒక్క వెంకటేష్ మాత్రమే డేట్స్ ఇచ్చాడు. కానీ, వెంకీతో మారుతి పెద్ద డిజాస్టర్ చేశాడు. అయితే, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో భారీ విజయం సాధించి మొత్తానికి తనలో మ్యాటర్ ఉందని బలంగా నిరూపించుకున్నాడు.

    ఇక ప్రస్తుతం మారుతి, గోపీచంద్ హీరోగా “పక్కా కమర్షియల్” అనే సినిమా చేస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా మారుతితో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని ఆ మధ్య పుకార్లు వినిపించాయి. మొత్తమ్మీద మారుతి మాత్రం తన తదుపరి చిత్రాలను భారీగా ప్లాన్ చేస్తున్నాడు.

    Also Read: కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వెళ్లాలనుకుంటున్నారా… అనుసరించాల్సిన మార్గం ఇదే!

    Recommended Video:

    Tags