Kandipappu: భారతదేశంలో కందిపప్పును చాలా వంటకాల తయారీకి ఉపయోగిస్తుంటారు. ప్రభుత్వాలు కూడా రేషన్ సరుకుల్లో బియ్యంతో పాటు కందిపప్పును ఎక్కువగా ఇస్తుంటారు. పప్పు చారు, సాంబార్, వంటి రకరకాల వెరైటీస్ తో మన ముందు ఉండే ఈ పప్పుతో చాలా రకాల ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాదు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఓ సారి మరి చూసేయండి.
Are you eating too much kandipappu? But this is for you..
ఇందులో ప్రోటీన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కొలెస్ట్రాల్, శాచ్యురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి సులభంగా అరుగుతుంది. అయితే కందిపప్పు ఎక్కువగా తింటే అజీర్తి, జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. ఇది కొందరికి పడదు. ఒకవేళ కందిపప్పును రాత్రి పూట తింటే అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా గ్యాస్, ఎసిడిటీ సహా అజీర్తి సమస్యల బారిన పడవచ్చు. అందుకే ఈ పప్పును పగటిపూట తినడమే మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు.
పగటి పూట డైజెస్టివ్ సిస్టమ్ మరింత చురుకుగా పనిచేస్తుంటుంది. పోషకాలు మంచిగా విరిగిపోయి శరీరానికి ఒంటపడుతాయి. కొత్తగా పప్పు తినడం అలవాటు చేసుకునే వారు చిన్న మొత్తాల్లో పప్పు తింటూ క్రమంగా ఆ వినియోగాన్ని పెంచండి. అయితే పప్పులు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచవు. కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ పప్పు తింటే మెలబలైజ్డ్ యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ స్ఫటికాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి దారితీస్తాయి అంటున్నారు నిపుణులు.
పప్పులో పొటాషియం ఉంటుంది. ఆహారంలో పొటాషియం ఎక్కువైతే హైపర్ కలేమియా ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ప్లాస్మా పొటాషియం స్థాయిలను పెంచుతుంది. దీని వల్ల కార్డియాక్ అరిథ్మియా, కండరాల బలహీనత లేదా పక్షవాతం బారి పడవచ్చు. ఇక దీని లక్షణాలు వాంతులు, అలసట, సక్రమంగా లేని హృదయ స్పందన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. అంటే కందిపప్పు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అధికంగా తీసుకోవడం వల్ల అనర్థాలు కూడా ఉన్నాయి అన్నమాట. మరి జాగ్రత్త.