Japanese walking : నేటి కాలంలో చాలామంది ఒత్తిడితో కలిగి ఉంటున్నారు. దీని నుంచి బయటపడేందుకు అనేక రకాల వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అయితే అందరికీ వ్యాయామం చేసే అంత సమయం ఉండదు. అందుకే మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. రోజుకు 10000 అడుగులు వేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే సాధారణ వాకింగ్ చేయడం కంటే డిఫరెంట్ గా వాకింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. డిఫరెంట్ వాకింగ్లో భాగంగా జపనీస్ వాకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సాధారణ వాకింగ్కు బదులు జపనీస్ వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని కేలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయని.. అలాగే కండరాలు బలంగా మారుతాయని చెబుతున్నారు. అసలు జపనీస్ వాకింగ్ ఎలా ఉంటుంది? దానిని ఎలా చేయాలి?
జపనీస్ వాళ్ళను చూడగానే ఎంతో ఫిట్గా కనిపిస్తూ ఉంటారు. వీరిలో నడి వయసు ఉన్న వారితో పాటు వృద్ధులు కూడా ఎంతో యాక్టివ్ గా కనిపిస్తారు. అందుకు వారు పాటించే ఆరోగ్య నియమాలే కారణమని కొందరు ప్రముఖులు తెలుపుతున్నారు. వారు పాటించే ఆరోగ్యా నియమాల్లో వాకింగ్ కూడా ఒకటిగా ఉంది. అయితే జపనీయులు సాధారణ వాకింగ్ కంటే డిఫరెంట్ గా వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. వీళ్ళ వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే?
సాధారణ వాకింగ్ అరగంట పాటు చేయడం వల్ల నార్మల్ గా ఉంటుంది. కానీ జపనీస్ ప్రకారం ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి వాకింగ్ స్టైల్ మార్చాలని అంటున్నారు. అంటే మొదట సాధారణంగా అడుగులు వేయాలి. ఆ తర్వాత ఐదు నిమిషాల తర్వాత వాకింగ్ స్పీడ్ పెంచాలి. మరో ఐదు నిమిషాలు మరింతగా పెంచాలి. ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి వాకింగ్ను మాస్క్ చివరకు మరింత స్పీడ్ పెంచాలి. ఆ తర్వాత మళ్లీ సాధారణంగా నడుస్తూ వెళ్లాలి. ఇలా చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు రాకుండా ఉండడమే కాకుండా.. కండరాలు బలంగా మారుతాయి. అంతేకాకుండా గుండె పనితీరు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉండి మంచి ఆలోచనలు వస్తాయి. అలాగే శరీరంలోని అనేక అవయవాలు కదులుతూ ఉంటాయి.
Also Read : డబ్బు ఆదా చేయాలంటే.. జపనీయుల ట్రిక్స్ తెలుసుకోవాల్సిందే
సాధారణ వాకింగ్ కంటే ఇలాంటి వాకింగ్ చేయడం వల్ల ఎన్నో రకాలుగా ప్రయోజనాలు పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని కేలరీలను తగ్గించుకోవచ్చు. అయితే జపనీస్ వాకింగ్ చేయడం వల్ల కేవలం 30 రోజుల్లోనే మరింత ఎక్కువగా కేలరీలను బర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే కొందరు వాకింగ్ కంటే రన్నింగ్ బెటర్ అని దానిని ఫాలో అవుతూ ఉంటారు. రన్నింగ్ కంటే ఈ విధంగా వాకింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే జపనీస్ ఎక్కువకాలంగా ఈ వాకింగ్ పద్ధతిని ఫాలో అవుతున్నారు. ప్రతిరోజు ఇలాంటి వాకింగ్ స్టైల్ ను కొనసాగిస్తూ ఆరోగ్యంగా ఉండాలని పేర్కొంటున్నారు.