Vastu Shastra : జీవితం బాగుండాలని అందరూ కోరుకుంటారు. కానీ కొందరు మాత్రమే మంచి జీవితాన్ని గడుపుతారు. అందుకు వారు పాటించే పద్ధతులు.. నియమాలు సక్రమంగా ఉండటమే. వీటితోపాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఫాలో అయినవారు తమ జీవితాన్ని సక్రమమైన దారిలో ఉంచుకోగలుగుతారు. చాలామంది ఇళ్లల్లో దరిద్రం తాండవిస్తోంది.. మరికొందరి ఇళ్లల్లో ఐశ్వర్యం వర్ధిల్లుతుంది. ఐశ్వర్యం వర్ధిల్లే ఇంట్లో వస్తువులు వాస్తు శాస్త్రం ప్రకారం సక్రమంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంటి తలుపులు కూడా సక్రమమైన పద్ధతిలో ఉండడం వల్ల వీరి ఇల్లు ఎప్పుడు సంతోషంగా ఉంటుందని కొందరు వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు బాగుండాలంటే తలుపులు ఏ విధంగా ఉండాలి? ఇంటికి ఎన్ని తలుపులు ఉంటే సంతోషంగా ఉంటుంది?
ప్రతి ఇంటికి ప్రధాన ద్వారం ప్రధానమైనది. ఎందుకంటే కుటుంబ సభ్యులంతా ఈ ద్వారం నుంచే ఇంట్లోకి ప్రవేశిస్తారు. అలాగే ఇల్లు నిర్మించుకున్న తర్వాత మొదటి అడుగు ఈ ద్వారం నుంచే ప్రారంభిస్తారు. దేవతలు కూడా ఈ ద్వారం నుంచే ఇంట్లోకి ప్రవేశిస్తారని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. అందువల్ల ఈ ద్వారాన్ని ఎప్పుడూ శుభప్రదంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. ప్రధాన ద్వారం ఎప్పుడైనా.. ఎక్కడైనా.. తూర్పు లేదా ఉత్తరం వైపు మాత్రమే ఉండాలి. నైరుతి దిశలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు.
Also Read : చీకటి పడ్డాక ఈ వస్తువులు, పదార్థాలను ఇవ్వొద్దు.. ఎందుకో తెలుసా?
ప్రధాన ద్వారం నుంచే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. అయితే ఈ ప్రధాన ద్వారం నకు ఉండే తలుపులు వృత్తాకారంలో గాని.. చతురస్త్రాకారంలో గాని ఉండకూడదు. పొడవు ఎక్కువగా వెడల్పు తక్కువగా ఉండాలి. ఇలా ఉంటేనే ఇంటికి శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ తలుపులకు ఉండే పెయింట్ తొలగిపోతే వెంటనే దానిని వేసుకోవాలి. ఈ ప్రధాన ద్వారం తలుపులు ఎప్పటికీ శుభ్రంగా ఉండాలి. అలాగే ఈ తలుపులు బయట వైపు తీసుకునేలా ఉండకూడదు. ఈ తలుపులు లోపలికి మాత్రమే ఉండాలి.
ప్రధాన ద్వారం తో పాటు ఇంటికి బేసి సంఖ్యలో దర్వాజలు ఉండాలి. అలాగే కిటికీలు కూడా బేసి సంఖ్యలో మాత్రమే ఉండాలి. సరి సంఖ్యలో దర్వాజలు లేదా కిటికీలు ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల ఇంట్లో ఎప్పుడూ దరిద్రం తాండవిస్తుంది. అలాగే ఇంటిలోకి లక్ష్మీ రావాలంటే ప్రధాన ద్వారం ఇరువైపులా మొక్కలను లేదా చెట్లను పెంచాలి. ఇవి ఉండడంవల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఇంటి తలుపులు పగిలినవి లేదా రంద్రాలు కలవి ఉండకూడదు. ముఖ్యంగా ప్రధాన ద్వారం ఎప్పుడు బాగుండే విధంగా చూసుకోవాలి.
ఇవే కాకుండా ఇంట్లోనే కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం గా ఉండడం వల్ల ఇంటిల్లిపాదికి శుభప్రదంగా ఉంటుంది. లేకుంటే ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవదు.