Japanese Tricks : కొందరు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. మరికొందరు డబ్బును (Money) చాలా పొదుపుగా ఖర్చు చేస్తారు. అయితే దీన్ని ఆదా చేయడంలో ఒకొక్కరికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ విధంగా డబ్బులను ఆదా చేయవచ్చు. కొందరు ఎంత డబ్బులను ఆదా చేయాలని అనుకున్న కూడా కుదరదు. అయితే డబ్బులను ఆదా చేయడంలో జపనీయులు దిట్ట. వీరు కకీబో (Kakeibo) అనే పద్ధతితో డబ్బులను బాగా ఆదా చేస్తారు. నెలవారీ ఖర్చుల మీద దాదాపుగా 35 శాతం వరకు డబ్బులను ఆదా చేస్తారు. ఇంతకీ కకీబో (Kakeibo) అంటే ఏంటి? ఈ పద్ధతి ద్వారా డబ్బులను ఆదా చేయడం ఎలా అని అనుకుంటున్నారా.. ఈ కకీబో (Kakeibo) అంటే గృహ ఆర్థిక బడ్జెట్. ఈ పద్ధతి ద్వారా ఎక్కువగా పొదుపు చేయవచ్చు. ఈ కకీబోను 1904లో జపనీస్ మొదటి మహిళా జర్నలిస్ట్ హనీ మోటోకో రూపొందించారు. ఈ పద్ధతి ద్వారా జపనీస్ మహిళలు (Womens) తమ నెలవారీ గృహ ఖర్చులను నిర్వహించడంలో ఇది బాగా సహాయపడుతుంది. మరి దీని ద్వారా డబ్బును ఆదా చేయడం ఎలాగో చూద్దాం.
అవసరాలు
ఈ కకీబో పద్ధతిలో మొత్తం నెలవారీ ఖర్చుల కోసం ప్లాన్ చేస్తారు. దాన్ని నాలుగు పార్ట్‌లుగా డివైడ్ చేస్తారు. అంటే నెలకు నాలుగు వారాలు ఉంటుంది. వీరు వారానికి ఇంత ఖర్చు పెట్టాలని రాసుకుంటారు. అంటే మీరు నెలకు ఒక 5000 ఖర్చు చేయాలనుకుంటే.. వారానికి లెక్క ప్లాన్ చేసుకుంటారు. ఇందులో కూడా అవసరమైన వాటినే కొంటారు. రోజువారీ అవసరాలు, వైద్య ఖర్చులు, రవాణా ఖర్చులు ఇలాంటి వాటికే ఉపయోగిస్తారు. అవసరం లేని వాటికి పెద్దగా ఖర్చు పెట్టరు.
డైలీ ఖర్చులు రాసుకోవడం
ఈ పద్ధతిని పాటించే వారు డైలీ ఖర్చులు ఒక బుక్‌లో రాసుకుంటారు. రూపాయి ఖర్చు పెట్టినా కూడా తప్పకుండా రాస్తారు. ఎందుకంటే వారు దేనికి ఖర్చు పెట్టారు? అది అవసరమైనదా? లేకపోతే పనికి రానిదా అనే విషయం తెలుస్తుంది. దీంతో ఇంకోసారి వృథాగా ఖర్చు పెట్టరు. అందుకే ఖర్చులను డైలీ రాస్తారు.
ఊహించని ఖర్చులు
ప్రతీ ఒక్కరికి కూడా ఊహించని ఖర్చులు ఉంటాయి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వంటివి వస్తుంటాయి. వీటి కోసం వారు ముందుగానే ప్లాన్ చేసి ఉంచుతారు. నెల జీతం అనేది అద్దె, నిత్యావసర సరుకులు వంటి వాటికే అయిపోతుంది. కాబట్టి వీటిని ముందే గుర్తించి ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి.
పొదుపు
కొందరు వచ్చిన అంత జీతాన్ని కూడా ఖర్చు చేస్తారు. కానీ జపనీయులు మాత్రం నెలలో వచ్చిన జీతంలో కాస్త పొదుపు చేస్తారు. కనీసం రూపాయి అయినా కూడా పొదుపు చేస్తారు. ఇలా చేయడం వల్ల అత్యవసర సమయాల్లో డబ్బు ఉంటుంది.
అవసరం లేని ఖర్చులు
వీరు అవసరం లేని ఖర్చులు చేయరు. ఒకవేళ చేసినా రాసుకుంటారు. ఇంకోసారి చేయకూడదని అనుకుంటారు. నెల పూర్తి అయ్యే సరికి వారి ఖర్చులను కౌంట్ చేస్తారు. ఇంకోసారి ఇలా చేయకూడదని ప్లాన్ చేస్తారు.