
Things Make Poor : మనం జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటాం. అన్ని విషయాల్లో ఆచితూచి అడుగేస్తాం. కానీ దానాలు చేయడంలో మాత్రం మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించం. ఇంట్లో ఏది పడితే అది దానంగా ఇస్తుంటాం. కానీ ఇలా చేయడం దుష్ఫలితాలు కలిగిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మన ఇంట్లో ఉండే వస్తువుల్లో కొన్నింటిని మనం దానం చేయరాదు. అలా చేయడం వల్ల మనకే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయంలో శాస్త్రం చెప్పింది నమ్మి మనం ఏ వస్తువులు దానం చేయకూడదో తెలుసుకుంటే మంచిది. లేకపోతే మనం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మన ఇంట్లో ఉండే చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటాం. అలాంటి చీపురును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు ఇవ్వొద్దు. అలా ఇస్తే మనకే ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. మన ఇంటికి వచ్చిన చుట్టాలకు చేతుల్లో కొబ్బరి నూనె వేస్తుంటాం. అలా చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే లక్ష్మీదేవి వారితో పాటు బయటకు పోతుంది. కత్తులు, సూదులు, చాకులు వంటివి కూడా ఎవరికి దానం చేయరాదు. అలా చేస్తే మనకే నష్టాలు సంభవించే అవకాశాలు ఉంటాయి.
ఇంట్లో పాడైపోయిన పదార్థాలను కూడా దానం చేయొద్దు. ఇలా చేయడం వల్ల దురదృష్టం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువవుతాయి. ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలుంటాయి. కోర్టు కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇలాంటి కష్టాలు మనకు ఇబ్బందులను తెచ్చిపెడతాయి. అందుకే మన ఇంట్లోని వస్తువులు దానం చేసేటప్పుడు ఓ సారి ఆలోచించుకోవాలి. ఇవి దానం చేయొచ్చా? లేదా ? అని తెలుసుకుని మరీ దానం చేస్తే మంచిది.
ఇలా చేయడం వల్ల మన ఇంట్లో డబ్బులు పోయే ఆస్కారం ఉంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బు నిలవకుండా పోతుంది. కొందరు ఇంట్లో పగిలిపోయిన వస్తువులు, చిరిగిపోయిన దుస్తులు దాచుకుంటారు. ఇదికూడా మంచిది కాదు. పనికి రానిది ఏదీ కూడా ఇంట్లో ఉండొద్దు. ఒకవేళ ఉంచుకుంటే దరిద్రం మన వెంటే ఉంటుంది. ఏ పని చేసినా కలిసి రాదు. ఎంత సంపాదించినా డబ్బు మంచినీళ్లలా ఖర్చవువుంది. అందుకే పగిలిపోయిన వస్తువులు, చిరిగిపోయిన దుస్తులు ఉంటే బయట పడేయడం సురక్షితం. ఇలా మన ఇంట్లో ఉండే వాటిపై జాగ్రత్తలు తీసుకోకపోతే మనకే ఇబ్బందులు రావడం సహజం.