https://oktelugu.com/

Ravanasura: రావణాసుర రీమేకా? కాపీనా?… డైరెక్టర్ ఏమంటున్నాడు!

Ravanasura: హీరో రవితేజ లేటెస్ట్ మూవీ రావణాసుర రీమేక్ అంటూ ఓ ప్రచారం ఊపందుకుంది. ఇది ఓ బెంగాలీ చిత్ర రీమేక్ అంటున్నారు. ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. రావణాసుర విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. రవితేజ ఈ మూవీలో లాయర్ రోల్ చేస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకుంది. ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్ర విజయాలతో రవితేజ ఊపు మీద ఉన్నారు. రావణాసుర మూవీతో హ్యాట్రిక్ కొడతాడని […]

Written By:
  • Shiva
  • , Updated On : April 5, 2023 9:45 am
    Follow us on

    Ravanasura

    Ravanasura

    Ravanasura: హీరో రవితేజ లేటెస్ట్ మూవీ రావణాసుర రీమేక్ అంటూ ఓ ప్రచారం ఊపందుకుంది. ఇది ఓ బెంగాలీ చిత్ర రీమేక్ అంటున్నారు. ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. రావణాసుర విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. రవితేజ ఈ మూవీలో లాయర్ రోల్ చేస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకుంది. ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్ర విజయాలతో రవితేజ ఊపు మీద ఉన్నారు. రావణాసుర మూవీతో హ్యాట్రిక్ కొడతాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

    రావణాసుర చిత్రంలో రవితేజ పాత్ర నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందట. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. వైలెన్స్ అధికంగా ఉన్నందుకే రావణాసుర చిత్రానికి ఏ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రావణాసురు బెంగాలీ మూవీ ‘విన్సీ డా’ రీమేక్ అంటున్నారు. ఈ చిత్ర రీమేక్ హక్కులు కొని మరీ తెరకెక్కించారట. మూల కథ తీసుకొని మార్పులు చేసి రూపొందించారట. రీమేక్ అన్న విషయాన్ని చిత్ర యూనిట్ దాచారంటూ ఓ ప్రచారం ఊపందుకుంది.

    నాలుగేళ్ళ క్రితం విడుదలైన విన్సీ డా బెంగాలీ పరిశ్రమలో సూపర్ హిట్. ఆ చిత్రాన్నే రావణాసురగా మలిచారు అంటున్నారు. అయితే ఈ వార్తలపై దర్శకుడు సుధీర్ వర్మ స్పందించారు. ఆయన ఈ పుకార్లను ఖండించారు. రావణాసురు వంటి కథ గతంలో రాలేదంటున్నారు. మీరు రెండు సినిమాలు చూడండి. పోలికలు ఉంటే అడగండి. రావణాసుర స్ట్రెయిట్ మూవీ. ఇది రీమేక్ కాదంటూ ఆయన వివరణ ఇచ్చారు. మరి దీనిపై స్పష్టత రావాలంటే మూవీ విడుదల కావాల్సిందే.

    Ravanasura

    Ravanasura

    సుధీర్ వర్మ ప్రస్తుతం హీరో నిఖిల్ తో ఓ మూవీ చేస్తున్నాడట. అనంతరం పవన్ కళ్యాణ్ తో మూవీ చేసే అవకాశం కలదని ఆయన స్పష్టత ఇచ్చారు. త్రివిక్రమ్ కథ సమకూర్చిన ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నట్లు వెల్లడించారు. స్వామి రారా మూవీతో దర్శకుడిగా మారిన సుధీర్ వర్మ ప్రేక్షకులను అలరించారు. అయితే ఆయనకు మరో హిట్ పడలేదు. దోచేయ్, కేశవ, రణరంగం నిరాశపరిచాయి. ఆయన చివరి చిత్రం శాకినీ డాకినీ సైతం ఆడలేదు.