SBI Hikes MCLR: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఎస్బీఐ పెంచిన వడ్డీ రేట్లతో వినియోగదారులకు చుక్కలు కనిపించనున్నాయి. హోం, పర్సనల్, వెహికల్ రుణాలపై చెల్లించే ఈఎంఐలు పెరగనున్నాయి. ఎంసీఎల్ఆర్ ప్రకారం వివిధ బ్యాంకుల్లో రుణం తీసుకోవాలనుకుంటే ఇక మీదట వడ్డీ రేట్లు అదరగొట్టనున్నాయి. ఆర్బీఐ సూచనల మేరకే ఎస్బీఐ ఇలా వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఆందోళనకు కలిగిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016లో వడ్డీ రేట్ల విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీంతో అవి ఇప్పుడు రెట్టింపవుతున్నాయి.

ఎస్బీఐ తాజాగా సవరించిన నిబంధనలతో 7.95 నుంచి 8.05 శాతానికి పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈఎంఐలు మోత మోగనున్నాయి. ఒకవేళ మనం వెహికల్ తీసుకుంటే దానిపై మనం చెల్లించే ఈఎంఐలు పెరగడంతో వినియోగదారులపై భారం పడనుంది. ఎంసీఎల్ ఆర్ బేసిస్ పాయింట్లు కూడా 15 శాతం పెంచుతూ ఆమోదం తెలిపింది. ఈ వడ్డీ రేట్లు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చాయి.
ఎస్బీఐ వడ్డీ రేట్లు పెంచడం కొత్తేమీ కాదు. ఇదివరకే మూడు నాలుగు సార్లు వడ్డీ రేట్లు పెంచింది. తాజాగా ఇప్పుడు కూడా నిన్న వడ్డీరేట్లు పెంచుతూ ఆమోదం తెలపడం గమనార్హం. రిజర్వ్ బ్యాంకు రెపో రేట్లు పెంచుతూ పోతుంటే ఇక ఏం చేసేదని ఖాతాదారులు ఆశ్చర్యపోతున్నారు. ఈఎంఐలు కట్టలేక లబోదిబోమంటున్నారు. కస్టమర్లకు నిరంతరం షాక్ లు ఇస్తూనే ఉంది. రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం వడ్డీ రేట్లు పెంచుతూ సామాన్యులను ముప్పతిప్పలు పెడుతోంది.

ఎస్బీఐ ఖాతాదారుల జీవితాలతో ఆడుకుంటోంది. వడ్డీ రేట్లు తరచూ పెంచుతుండటంతో ఈఎంఐల భారం పెరగనుంది. ఓ పక్క పెరుగుతున్న నిత్యావసరాల ధరలు మరోవైపు ఈఎంఐల గోల సామన్యడికి తలవంపులు తెస్తున్నాయి. భవిష్యత్ లో ఇంకా వడ్డీ రేట్లు పెరగనున్నాయో ఏమో అంతుచిక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా ఖాతాదారులను మాత్రం అష్టకష్టాలు పెడుతోంది. దీంతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.