Balakrishna- Mahesh Babu: చిరునవ్వుకు మహేష్ చిరునామా. మహేష్ నవ్వితే చాలా అందంగా ఉంటుంది. గత మూడు రోజులుగా అది కరువైంది.సూపర్ స్టార్ మరణం ఆయన్ని విషాదంలోకి నెట్టివేసింది. కృష్ణ ఆయనకు కేవలం తండ్రి కాదు. గైడ్, గాడ్ ఫాదర్, రోల్ మోడల్. మా నాన్న నా హీరో అని అనేక సందర్భాల్లో మహేష్ గర్వంగా చెప్పుకున్నారు. ఆయన స్పూర్తితో హీరోగా ముందుకు సాగుతున్నారు. కృష్ణ లేరన్న నిజం, ఇక తిరిగిరారన్న వాస్తవం మహేష్ ని కృంగదీస్తున్నాయి. గత మూడు రోజులుగా మహేష్ ముఖంలో చిరునవ్వు కరువైంది. వేదన ఆయన మోములో తిష్ట వేసింది.

అంత వేదనలో కూడా నటసింహం బాలయ్య మహేష్ ముఖంలో చిరునవ్వు తెప్పించారు. కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన బాలకృష్ణ అనంతరం అక్కడే ఉన్న మహేష్ బాబుతో మాట్లాడారు. బాలకృష్ణ మహేష్ కి ధైర్యం చెప్పారు. అలాగే మహేష్ ని వేదన నుండి సాడ్ మూడ్ నుండి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బాలకృష్ణ చిన్న సరదా సంభాషణతో మహేష్ ని నవ్వించారు. పక్కనే ఉన్న మహేష్ కుమారుడు గౌతమ్ కూడా బాలకృష్ణ మాటలకు నవ్వాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుశల ప్రశ్నలతో కష్టకాలంలో మహేష్ ని నవ్వించిన బాలయ్య గ్రేట్ అంటున్నారు. అందుకు ఆయనకు థాంక్స్ అంటూ ఫ్యాన్స్ ఈ వీడియో వైరల్ చేస్తున్నారు. సందర్భం ఏదైనా బాలయ్య తన ప్రత్యేకత చాటుకున్నారని అంటున్నారు. ఇక ఈ ఏడాది మహేష్ కుటుంబ సభ్యులు ముగ్గురు మరణించారు. జనవరిలో అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్ నెలలో అమ్మ ఇందిరా దేవి కన్నుమూశారు.

నవంబర్ 15 ఉదయం కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కృష్ణ కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ తో కృష్ణ ఆసుపత్రిలో చేరారు. అచేతన స్థితిలో ఉన్న కృష్ణను కాపాడేందుకు వైద్యులు చాలా ప్రయత్నం చేశారు. వయసు రీత్యా ఆయన శరీరం సహకరించలేదు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి గురై కృష్ణ కన్నుమూశారు. నేడు పద్మాలయా స్టూడియోలో అభిమానుల సందర్శనార్ధం భౌతికకాయం ఉంచారు. మహాప్రస్థానంలో సాయంత్రం కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.
BIG Thanks To #NandamuriBalakrishna Garu
For making @urstrulyMahesh Smile in this HARD times
Your Support to him Unforgettable 🙏🏻#RIPKrishnaGaru 🙏🏻 pic.twitter.com/5MosMe2Dla— Mastanvali Shaik (@Mastanv26188863) November 16, 2022