Woman Extra Marital Relationship: ఒకరికి ఇల్లాలు అయిన తర్వాత, ఇంకో వ్యక్తి ఇంటిపేరు మోస్తున్న తర్వాత మోజుకు శరీరాన్ని దూరంగా ఉంచాలి. ఆకర్షణ అనే పదానికి మనసులో చోటు ఉంచకూడదు. ఇది మగ వాళ్లకు కూడా వర్తిస్తుంది.. కానీ ఎప్పుడైతే తనువు కట్టుతప్పుతుందో… ఎప్పుడైతే మనసు పరాయి విషయాల మీద లగ్నం చేస్తుందో… అప్పుడే సంసారం అనే నావ మునగడం మొదలవుతుంది. ఆ మోజులో పడి ఇంటిని, ఒంటిని పట్టించుకోవడం మానేస్తే జరగాల్సిన నష్టం జరుగుతుంది. పొరుగింటి పుల్ల కూర రుచి గానే ఉంటుంది. ఆ రుచి కేవలం ఒకటి రెండు రోజులకే పరిమితం అవుతుంది.. తర్వాత? నాలుకను అంత సులభంగా సంతృప్తి పరచడం సాధ్యం కాదు. ఉప్పో, పప్పో మన తిండి మనమే తినాలి. సరే ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే… వివాహేతర సంబంధాలు పెట్టుకుని భర్తలను కడతేర్చిన మహిళలు ఇప్పుడు ఎటువంటి బాధలు పడుతున్నారో ఒక్కసారి ఈ విశ్లేషణ చదవండి.

భర్తను చంపింది.. కానీ..
2017లో మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూల్ పట్టణంలో స్వాతి అనే మహిళ చేసిన ఘనకార్యం గుర్తుంది కదా.. కట్టుకున్న భర్తను చంపి అతని స్థానంలో తన ప్రియున్ని తెచ్చుకోవాలనుకుంది.. సంఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఎవడు సినిమాలో మాదిరి తన భర్తను చంపించింది.. తర్వాత తన ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించింది. అతడే నా భర్త అని అందరినీ నమ్మించింది. కానీ తప్పు ఎప్పుడో ఒకరోజు బయటపడాల్సిందే కదా.. ఆరోజు రానే వచ్చింది.. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతోంది.. నా అనే పలకరింపు లేక నరకం చూస్తోంది.. జైలు నుంచి విడుదలయ్యాక, ఎక్కడికి వెళ్లాలో తెలియక వసతి గృహంలో తలదాచుకుంటుంది.. ఒకప్పుడు చూడ చక్కని రూపంతో ఉన్న స్వాతి.. వాళ్ళ బక్క చిక్కిన దేహంతో కనిపిస్తోంది.. దీనంతటికీ కారణం పరాయి మోజు.. అది ఒక్కటే గనుక లేకుంటే ఈ రోజున స్వాతి సంసార జీవితం సుఖమయంగా సాగేది.
50 ఏళ్ల వయసులో పాడు బుద్ధి
సాధారణంగా ఒక మహిళ లేదా పురుషుడు అయిదు పదుల వయసు వచ్చిన తర్వాత ఏం కోరుకుంటారు? కొడుకు కోడలు, బిడ్డ అల్లుడు, మనవాళ్లు, మనవరాళ్ళతో ఆనందంగా గడపాలి అనుకుంటారు.. కానీ ఐదు పదుల వయసు వచ్చిన తర్వాత ఈ మహిళ బుద్ధి వక్రమార్గం పట్టింది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన తర్వాత, భర్తతో హాయిగా ఉండాల్సింది పోయి పరాయి వ్యక్తికి దగ్గర అయింది. అతనితోనే కలిసి ఉండాలని భర్తను చంపించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్, ఇమాంబీ భార్య భర్తలు.. ఇద్దరు వయసు కూడా ఐదు పదులు.. ఇమాంబి మోహన్ రావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఆ విషయం భర్తకు తెలిసింది.. అతడు ఆమెను నిలదీశాడు. ఇది సహించలేని ఇమాంబి అతని అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి పథకం పన్నింది.. బండి మీద వెళుతున్న భర్తకు విషపు ఇంజక్షన్ ఇప్పించి హత్య చేయించింది.. ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతోంది..
ఇక మరో కేసులో జనగామ జిల్లా హనుమంతపురం గ్రామానికి చెందిన లకావత్ కొమురవెల్లి, భారతికి 8 సంవత్సరాల క్రితం పెళ్లయింది.. వీరికి ముగ్గురు పిల్లలు.. రెండు సంవత్సరాల క్రితం పరిచయమైన వ్యక్తితో భారతి వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఒకరోజు ఇద్దరు సన్నిహితంగా ఉండగా అది భర్త కంటపడింది.. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి భర్తను చంపించింది.. దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు భారతి, ప్రియుడు కలిసి కొమురవెల్లి మృతదేహాన్ని 50 కిలోమీటర్ల పాటు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు. వంతెన పైనుంచి కిందికి తోసేశారు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారతి మూడేళ్ల కుమార్తె తనకు తెలిసిన మాటల్లో తన తండ్రిని తన తల్లి ఎలా ఉరివేసి చంపిందో పోలీసులకు వివరించింది..

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో ప్రియుడితో కలిసి ఓ భార్య తన కూతుర్లు చూస్తుండగానే చంపింది. మృదేహాన్ని మంచినీళ్ల ట్యాంకులో పడేసింది.
ఇక నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో వరుసకు బాబాయి అయ్యే వ్యక్తితో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది.. భర్తకు ఈ విషయం తెలియడంతో రోకలి బండతో మోడీ హత్య చేసింది. ఈ ఘటనల్లో వీరంతా కూడా దోషులుగా తేలారు. ఇప్పుడు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.. కానీ వీరి కడుపులో జన్మించిన పాపానికి పిల్లలు అనాధలుగా మారి నరకం చూస్తున్నారు.