Ben Stokes- IPL Auction 2023: ఏ ముహూర్తాన లలిత్ మోడీ ఐపీఎల్ ను వెలుగులోకి తెచ్చాడో తెలియదు కానీ.. క్రికెటర్లు ₹కోట్లు వెనకేసుకుంటున్నారు. ఏకంగా ఐపీఎల్ ఫుట్ బాల్ లీగ్ నే దాటేసింది. కోట్ల కొద్దీ అండార్స్ మెంట్ల తో భారీ ఆదాయం తో అలరారుతోంది. ఒక్క పాకిస్తాన్ మినహా ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెటర్లు ఐపీఎల్ ఆడుతున్నారు. ప్రస్తుతం 14 వ సీజన్ కు సంబంధించి వేలం నడుస్తోంది..అయితే బడా బడా కార్పొరేట్లు ఇందులో పాల్గొంటున్న నేపథ్యంలో ఆటగాళ్లు భారీ ధర పలుకుతున్నారు. ఈసారి కనివిని ఎరుగని స్థాయిలో వేలం సాగుతోంది.

ఎడమ చేతి వాటం వాళ్ల హవా
ఐపీఎల్ లో అందరూ బ్యాట్స్ మెన్ ఒకెత్తు అయితే ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ మరొక ఎత్తు. ఐపీఎల్ ప్రారంభం నుంచి 2019 వరకు ఆడిన యువరాజ్ సింగ్ భారీగా ఆర్జించిన ఆటగాడి గా పేరు పొందాడు. ఇతడి సరసన ఇంగ్లాండ్ సంచలన బ్యాట్స్ మెన్ బెన్ స్టోక్స్ చేరాడు. కాకపోతే ఐదు సీజన్ లకు గానూ యువి 46.28 కోట్లు ఆర్జించాడు. బెన్ స్టోక్స్ మూడు సీజన్ లలో 43.25 కోట్లు సంపాదించాడు. వీరి ఇద్దరి బ్యాటింగ్ శైలి ఒకే తీరుగా ఉంటుంది. విధ్వంసకరమైన బ్యాట్స్ మెన్ జాబితాలో వీరు ముందు వరుసలో ఉంటారు. యువి ఐపీఎల్ కెరీర్ 2008 లో సన్ రైజర్స్ టీం తో ప్రారంభించాడు. తర్వాత పుణె వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్, ముంబాయి ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇప్పటి వరకు 132 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన యువి 2,750 పరుగులు చేశాడు. బౌలింగ్ చేసి 36 వికెట్లు తీశాడు.

బెన్ స్టోక్స్
2017 లో ఐపీఎల్ లో రైజింగ్ పుణె జట్టు ద్వారా ఆరంగేట్రం చేశాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్నాడు. ఇప్పటి వరకూ 43 మ్యాచ్ లు ఆడి 920 పరుగులు చేసి 28 వికెట్లు తీశాడు..రాజస్థాన్ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్ లో అతడి అత్యధిక స్కోర్ 107 పరుగులు. విచక్షణ రహితంగా బౌలర్ల పై విరుచుకుపడి బ్యాటింగ్ చేసే ఇతడు తనదైన రోజున ఏదయినా చేయగలడు. ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ లో భారీగా ధర పలికిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈసారి ఐపీఎల్ లో ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.