karate kalyani: సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కరాటే కళ్యాణి. నటిగా కంటే వివాదాలతోనే ఫేమస్ అయ్యారు ఈమె. ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన కరాటే కళ్యాణి వైవాహిక జీవితంలో పడ్డ కష్టాలు వెల్లడించారు. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరాటే కళ్యాణి తన లైఫ్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. వివాహం తన జీవితాన్ని నాశనం చేసిందని పరోక్షంగా వెల్లడించారు. కళ్యాణి భర్త ఆమెను హింసించారట. అతడి వేధింపులు ఎలా ఉండేవో ఒక ఉదాహరణ చెప్పింది కళ్యాణి. ఓ రోజు బేగంపేటలో నడిరోడ్డుపై బట్టలు లాగేసి వివస్త్రను చేశాడు. అందరూ చూస్తుండగా నాకు వస్త్రాపహరణం జరిగింది.

నా భర్త దారుణాల్లో ఇవి మచ్చుకు మాత్రమే. అతడు దారుణమైన వేధింపులకు పాల్పడ్డాడు. అతనితో జీవించలేక విడాకులు తీసుకొని విడిపోయాను. నేను చేసే పాత్రల ఆధారంగా నన్ను చాలా మంది తప్పుగా అనుకుంటారు. కానీ నాణానికి మరోవైపు నాలో మీకు తెలియని కోణం మరొకటి ఉంది. నేను నిజ జీవితంలో చాలా మందికి సహాయం చేశాను. సినిమాలు కేవలం బ్రతుకు దెరువు కోసం చేస్తున్నాను. నాది సినిమాల్లో కనిపించే స్వభావం కాదని కళ్యాణి చెప్పుకొచ్చారు.
40 ప్లస్ లో ఉన్న కరాటే కళ్యాణి రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధం అన్నారు. ఇప్పటికీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉంది. నిజమైన ప్రేమ కోసం నేను పరితపిస్తున్నాను. స్వచ్ఛమైన ప్రేమ అందించే వ్యక్తి దొరికితే వివాహం చేసుకుంటాను, అని కరాటే కళ్యాణి సదరు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కళ్యాణి చాలా కాలంగా ఒంటరిగా ఉంటున్నారు. ఆమె ఒక పాపను పెంచుకుంటున్నట్లు సమాచారం. అయితే సరైన దత్తత పత్రాలు లేకుండా కరాటే కళ్యాణి పాపను పెంచుకుంటున్నారనే ఆరోపణలతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు దాడులు చేశారు.

పాప కోసం కరాటే కళ్యాణి ఇంటిని సోదా చేశారు. అనంతరం తన వద్ద పెరుగుతున్న పాప పేరెంట్స్ తో పాటు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. విజయనగరంకి చెందిన కరాటే కళ్యాణి బ్లాక్ బెల్ట్ సాధించారు. అనేక చిత్రాల్లో వ్యాంప్ రోల్స్ చేశారు. కృష్ణ, మిరపకాయ్ చిత్రాల్లో కరాటే కళ్యాణి చేసిన పాత్రలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. కృష్ణ మూవీలో ఓనర్ బ్రహ్మానందంతో రొమాన్స్ చేసే పనిమనిషి పాత్రలో కరాటే కళ్యాణి అలరించారు. సీరియల్స్ లో కూడా నటించిన కరాటే కళ్యాణి ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు. బిగ్ బాస్ సీజన్ 4 లో కరాటే కళ్యాణి పాల్గొన్నారు.