Xiaomi 18 leaked specifications: ప్రముఖ చైనా కంపెనీ Xiaomi భారత్లో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకువస్తుంది. అయితే ఈ కంపెనీకి చెందిన 17 సిరీస్ గత ఏడాదిలో ప్రారంభించింది. దీనిని ఇప్పుడు భారత్ లోకి తీసుకువస్తున్నారు. ఇటీవల చాలామంది వినియోగదారులు ఫ్లాగ్ ఫిష్ మొబైల్స్ కోసం ఆసక్తి చూపుతున్నారు. దీని దృష్టిలో ఉంచుకొని ఈ కంపెనీ 17 సిరీస్ ను వినియోగదారులకు పరిచయం చేయనుంది. అయితే వీటి తర్వాత తర్వాత షావోమి 18, 18 ప్రో, 18 ప్రో మాక్స్ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ మార్కెట్లోకి 18 సిరీస్ వస్తే మొబైల్స్ ఎలా ఉంటాయో లీకులు వస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే?
నేటి కాలంలో చాలామంది మొబైల్స్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారితో పాటు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారు ప్రత్యేకంగా కెమెరా కొనుగోలు చేయకుండా మొబైల్ లోనే అధిక మెగాపిక్సల్ ఉండే వాటిని కొనుగోలు చేస్తున్నారు. వీరికి అనుగుణంగా Xiaomi 18 మొబైల్లో 50 MP మెయిన్ కెమెరా ఉండనుంది. అయితే చావమే 18 ప్రో మాక్స్ లో 200 MP తో ఉండే కెమెరా ఉంటుందని తెలుస్తోంది. అల్ట్రా వైడ్ 50 MP ఉండగా.. టెలిఫోటో 200 MP తో పని చేయనుంది.
Also Read: కెమెరా, బ్యాటరీ పర్ఫామెన్స్ మెరుగ్గా ఉండాలంటే ఈ ఫోన్ కొనాల్సిందే..
డిస్ప్లే విషయానికి వస్తే 18 సిరీస్లో 6.3 అంగుళాల AMOLED డిస్ప్లేను చూడొచ్చు. ప్రో మాక్స్ లో మాత్రం 6.9 వరకు ఉండనుంది. ఈ డిస్ప్లే మూవీస్ తో పాటు గేమ్స్ కోరుకునే వారికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 నుంచి స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 వరకు ప్రాసెస్ ను అమర్చనున్నారు. ఈ ప్రాసెసర్ తో మల్టీ టాస్కింగ్ యూస్ చేసేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే సమర్థవంతమైన బ్యాటరీ కూడా ఇందులో చూడొచ్చని అంటున్నారు.
2027 వ సంవత్సరం వరకు ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అంతకుముందే దీని గురించి లీకులు రావడంతో చాలామంది ఈ మొబైల్ గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇది మార్కెట్లోకి వస్తే రూ.94,999 ప్రారంభ ధర నుంచి రూ.1,09,999 వరకు విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే షావోమి 17 సిరీస్ తర్వాత వీటి అమ్మకాలపై పూర్తి అంచనాకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.