Kaikala Satyanarayana Last Wish: నటుడిగా కైకాల సత్యనారాయణ శిఖరాలు అధిరోహించారు. ఆరు దశాబ్దాల సినిమా ప్రయాణంలో ఆయన చేయని పాత్ర లేదు. సాంఘిక, పౌరాణిక,జానపద, సోషియో ఫాంటసీ, కామెడీ, హారర్ అన్ని రకాల జోనర్స్ ట్రై చేశారు. కొన్ని ఐకానిక్ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. సిల్వర్ స్క్రీన్ పై యముడు అంటే కైకాల సత్యనారాయణ గారే గుర్తొస్తారు. ఇక మహాభారతం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాల్లో కైకాల సత్యనారాయణ భీముడు పాత్రలు చేశారు. ఆయన ఆహార్యం, ఆంగికం భీముడు, యముడు పాత్రలకు చక్కగా సరిపోయేది.

ఇక మాయాబజార్ మూవీలో ఎస్వీఆర్ చేసిన ఆల్ టైం గ్రేట్ రోల్ ఘటోత్కచుడిగా కూడా నటించే అవకాశం కైకాల సత్యనారాయణకు దక్కడం విశేషం. ఎస్వీ కృష్ణారెడ్డి ఘటోత్కచుడు టైటిల్ తో సోషియో ఫాంటసీ చిత్రం చేశారు. ఆ మూవీలో కైకాల టైటిల్ రోల్ చేశారు. పాపను కాపాడే ఘటోత్కచుడుగా ఆయన కనిపించారు. నాలుగు తరాల స్టార్ హీరోలతో కైకాల నటించారు. అలాంటి కైకాల సత్యనారాయణకు తీరని కోరిక ఒకటి ఉందట.
అదేమిటంటే… చిరంజీవి-బాలకృష్ణ మల్టీస్టారర్ చేయాలని, అందులో తాను నటించాలని అనుకున్నారట. 1973లో ఎన్టీఆర్-కృష్ణ హీరోలుగా దేవుడు చేసిన మనుషులు విడుదలై పెద్ద విజయం సాధించింది. ఆ మూవీలో సత్యనారాయణ కీలక రోల్ చేశారు. ఆయనకు నచ్చిన చిత్రాల్లో దేవుడు చేసిన మనుషులు ఒకటి. ఎన్టీఆర్, కృష్ణల నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ అయిన చిరంజీవి-బాలకృష్ణ కలిసి మూవీ చేయాలని కైకాల ఘాడంగా కోరుకున్నారట. అయితే ఆయన కోరిక కలగానే మిగిలిపోయింది.

చిరంజీవి-బాలయ్యల మల్టీస్టారర్ కోసం కొందరు ప్రయత్నాలు చేశారు. అయితే అవి కార్యరూపం దాల్చలేదు. కొంతలో కొంత కైకాల కోరిక ఆర్ ఆర్ ఆర్ తో తీరిందట. ఎన్టీఆర్-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ కైకాలకు చాలా బాగా నచ్చిందట. చిరంజీవి-బాలయ్యలను ఒక మూవీలో చూసే ఆశ తీరకపోయినా… వారి వారసులు ఎన్టీఆర్-చరణ్ లు కలిసి నటించారని సంతోషపడ్డారట. కానీ తాను కోరుకున్న చిరు, బాలయ్యల మల్టీస్టారర్ కలగానే మిగిలిపోయింది. 87 ఏళ్ల వయసులో లెజెండ్ కైకాల సత్యనారాయణ వినీలాకాశంలోకి ఏగిపోయారు. ఈ ఏడాది ముగ్గురు లెజెండ్స్ ని టాలీవుడ్ కోల్పోయింది. సెప్టెంబర్ లో కృష్ణంరాజు, నవంబర్ లో కృష్ణ కన్నుమూశారు.