Driving Safe App: సొంత వాహనాల్లో వెళ్లేవారు..కొత్త ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు తాము చేరుకోవాల్సిన డెస్టినేషన్ కోసం గూగుల్ మ్యాప్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ మ్యాప్‌లో కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగాయి. కొన్నిసార్లు వాహనాలు నదులు, బావులు, చిన్న చిన్న గల్లీల్లోలకి కూడా దూసుకుపోయాయి. ఇలా అనేక మంది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
అనుకోని ప్రమాదాలు..
గూగుల్ తల్లిని నమ్ముకుని ముందుకు సాగే వాహనదారులు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. అకస్మాత్తుగా వచ్చే సమస్యను గూగుల్ మ్యాప్ అప్‌డేట్ చేయలేదు. అంచనా వేయదు. దీంతో ఒక్కోసారి స్పీడ్‌గా వెళ్తున్న కారు కూడా సడన్‌గా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి. ఒక్కోసారి రోడ్డు డైవర్షన్ గురించి తెలియక దారి తప్పిన సందర్భాలు చూస్తున్నాం. గూగుల్ తల్లిని నమ్ముకుని యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి.
ఈ యాప్‌తో సేఫ్ డ్రైవ్..
గూగుల్ మ్యాప్‌లో పొరపాట్లను గుర్తించిన ఓ అమ్మాయి సేఫ్ డ్రైవింగ్ కోసం ఓ కొత్త యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌తో మన డెస్టినేషన్‌ను సేఫ్‌గా చేరుకోవడంతోపాటు మనం వెళ్తున్న వాహనాలకు ముందు రాబోయే ప్రమాదాలను కూడా ఈ యాప్ హెచ్చరిస్తుంది. డైవర్షన్, స్పీడ్ బ్రేక్, రిపేర్స్, ట్రాఫిక్, ఇలా అన్నీ మనకు వాయిస్ మెసేజ్ ద్వారా అందిస్తుంది. ఇక మన చేరుకునే గమ్యానికి దగ్గరి దారిని కూడా చూపుతుంది. ఫ్లై ఓవర్లు ఎక్కాలో వద్దో కూడా తెలియజేస్తుంది. యూటర్న్ ఎక్కడ తీసుకోవాలి. ఎక్కడి నుంచి నియర్‌గా మన గమ్యం ఉంటుంది అనే వివరాలు తెలియజేస్తుంది.. ఇంతకీ ఈ యాప్ పేరు చెప్పలేదు కదూ.. దానిపేరే మాపిల్స్ మ్యాప్ (maapls map). ఇదిగూగుల్ కన్నా చాలా అక్యూరసీగా పనిచేస్తుంది. మనం వెళ్తున్న మార్గంలో ఎన్ని టోల్స్ ఉన్నాయి. ఎంత టోల్ చెల్లించాలి అనే వివరాలను కూడా ముందే తెలియజేస్తుంది. మనం వెళ్తున్న మార్గంలో సేఫ్‌గా జర్నీ చేయడానికి ఈ మాపిల్స్ మ్యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. మీరూ ఒకసారి ట్రై చేయండి.