Homeఅంతర్జాతీయంSnorkelling : మోడీ చేసిన ‘స్నోర్కెలింగ్ ’ అంటే ఏంటి? ఎక్కడ చేస్తారు? ఆసక్తికర స్టోరీ

Snorkelling : మోడీ చేసిన ‘స్నోర్కెలింగ్ ’ అంటే ఏంటి? ఎక్కడ చేస్తారు? ఆసక్తికర స్టోరీ

Snorkelling : స్నోర్కెలింగ్ .. వినడానికి కొత్తగా ఉన్నా.. రెండు రోజులుగా ఈ పదం వైరల్‌ అవుతోంది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యద్వీప్‌ తీరంలో స్నోర్కెలింగ్ చేశారు. ఈ వయసులో మోదీ సముద్ర గర్భంలోకి వెళ్లి.. అక్కడి జీవరాశులను పరిశీలించారు. 140 కోట్ల మంది ప్రజల కోసం తాను ఇంకా ఎంత కష్టపడాలో తనకు ఈ స్నోర్కెలింగ్ నేర్పింది అంటూ ప్రధాని మోదీ తన ఎక్స్‌ ఖాతాలో ఫొటోలు పోస్టు చేశారు. సాహసాలు చేయాలనుకునేవారు లక్ష్యద్వీప్‌ తీరంలో నేర్చుకోండి అని కూడా సూచించారు.

– స్నోర్కెలింగ్ అంటే..
స్నోర్కెలింగ్ అంటే నదులు, సముద్ర గర్భంలోకి వెళ్లి.. అక్కడి జీవరాశుల జీవనాన్ని గమనించడమే.. ప్రత్యేక స్విమ్‌ సూట్‌ ధరించి స్నోర్కెలింగ్ చేసేవారు సముద్ర గర్భంలోకి వెళ్తుంటారు. అక్కడి వాతావరణాన్ని, సముద్ర జీవుల గురించి అధ్యయనం చేస్తుంటారు. ప్రత్యేక సూట్ ధరించడం వలన ఎక్కువ సేపు నీటిలో గడిపే వీలుంటుంది. శ్వాసకు ఎలాంటి ఇబ్బంది కలుగదు. మరోవైపు కళ్లు తెరిచి జీవరాశులను చూడవచ్చు.

-ఫిజీ తీరంలో ఎక్కువగా..
ఫిజీ సమీపంలోని పగడపు దిబ్బపై పగడాల మధ్య ఎక్కువగా స్నోర్కెలింగ్ చేస్తారు. స్నోర్కెలింగ్ చేసేవారిని స్నార్కెలర్స్‌ అంటారు. ఫిజీ తీరంలో ఇదో వినోద కార్యక్రమం. ముఖ్యంగా ఉష్ణమండల ప్రదేశాల్లో స్నోర్కెలింగ్ ఎక్కువ చేస్తుంటారు. స్నోర్కెలింగ్ ను అన్ని వయసులవారు ఇష్టపడతారు. ఇది చాలా తక్కువ శ్రమతో కూడుకున్నది. స్నోర్కెలర్స్‌ నీటి అడుగు భాగంలో రగ్బీ, హాకీ లాంటి ఆటలు కూడా ఆడుతుంటారు.

-స్నోర్కెలింగ్ సూట్‌ ప్రత్యేకం..
ఇక స్నార్కెలింగ్‌ చేసేవారు ధరించే సూట్‌ చాలా ప్రత్యేకం. ఇందులో స్విమ్మింగ్‌ గాగుల్స్‌ ఉంటాయి. డైవింగ్‌ మాస్క్, శ్వాస తీసుకోవడానికి ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. సముద్రపు నీరు శరీరాన్ని తాకడం ద్వారా రాషెస్‌ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటివి రాకుండా ఈ ప్రత్యేకమైన సూట్‌ మనకు రక్షణ ఇస్తుంది. ఇందులో డ్రై, వెట్‌ సూట్స్‌ ఉంటాయి. కొంతమంది వాటర్‌ ప్రూఫ్‌ సూట్స్‌ వాడతారు.

– నీటిలో ఉన్నా.. ఉపరితలం గాలి..
స్నోర్కెల్‌ సూట్‌ ధరించి నీటిలోకి వెళ్లిన వారు.. లోపల కూడా నోరు, ముక్కుతో ఉపరితలంపైన ఉన్న గాలిని పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రత్యేక పరికరం అమర్చుతారు. ఇంటిగ్రేటెడ్‌ వెర్షన్‌ ఉపరితల స్నోర్కెలింగ్ కు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రత్యేక పరికరం స్పియర్‌ ఫిషింగ్‌ , ఫ్రీడైవింగ్‌ , ఫిన్స్‌ స్విమ్మింగ్‌ , అండర్‌ వాటర్‌ హాకీ , అండర్‌ వాటర్‌ రగ్బీ, స్కూబా పరికరాలతో ఉపరితల శ్వాస కోసం నీటి అడుగున ఉపయోగపడుతుంది. స్విమ్మర్‌ యొక్క స్నార్కెల్‌ అనేది ఔ లేదా ఒ ఆకారాన్ని పోలి ఉంటుంది. దిగువ కొన నోటిలో అమర్చుకునేలా తేలికపాటి మెటల్‌ లేదా రబ్బర్‌ లేదా ప్లాస్టిక్‌తో తయారు చేయబడి ఉంటుంది.

-కొంత ప్రమాదం కూడా..
స్నార్కెల్స్‌ శ్వాస సంబంధిత డెడ్‌ స్పేస్‌ను కలిగి ఉంటాయి. వినియోగదారుడు తాజా శ్వాసను తీసుకున్నప్పుడు, స్నార్కెల్‌లో మిగిలి ఉన్న పీల్చిన గాలిలో కొంత భాగాన్ని మళ్లీ పీల్చడం జరుగుతుంది. పీల్చే పరిమాణంలో స్వచ్ఛమైన గాలి పరిమాణాన్ని తగ్గిస్తుంది. రక్తంలో కార్బన్‌ డయాక్సైడ్‌ పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది హైపర్‌క్యాప్నియాకు దారితీయవచ్చు. ట్యూబ్‌ యొక్క వాల్యూమ్‌ ఎక్కువ, శ్వాస యొక్క చిన్న టైడల్‌ వాల్యూమ్‌ తక్కువ అవుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో సమస్య మరింత తీవ్రమవుతుంది.  దీనివల్ల వాయు ప్రవాహానికి నిరోధకతను పెంచుతుంది. ప్రత్యేక స్నార్కెల్‌తో స్నార్కెల్‌ చేస్తున్నప్పుడు ముక్కు ద్వారా అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోవడం కార్బన్‌ డయాక్సైడ్‌ ఏర్పడటాన్ని కొద్దిగా తగ్గిస్తుంది.

సో ఇది ఎక్కువసేపు సముద్రంలో చేయడం అంత శ్రేయస్కరం కాదు.. కొద్దిసేపు వినోదానికి చేయడం వరకూ ఓకే. మోడీ చేయడంతో ఇది మరింతగా పాపులర్ అయ్యింది..

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version