https://oktelugu.com/

Insurance Policy: ఇది లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకండి.. లేకుంటే భారీగా నష్టపోతారు..

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. వీటిలో లైఫ్ టైం ఇన్సూరెన్స్ లో ఉండగా మరికొన్ని హెల్త్ పాలసీలు ఉన్నాయి.

Written By: , Updated On : January 24, 2025 / 03:32 PM IST
Insurence-Policy

Insurence-Policy

Follow us on

Insurance Policy: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. వీటిలో లైఫ్ టైం ఇన్సూరెన్స్ లో ఉండగా మరికొన్ని హెల్త్ పాలసీలు ఉన్నాయి. అయితే ఏ పాలసీ తీసుకున్నా.. వాటి Premum వివిధ రకాలుగా ఉంటుంది. కొన్ని ప్రీమియంలు Quarter ఉండగా.. మరికొన్ని ప్రీమియాలు Half Year లేదా Yearly కూడా ఉంటాయి. ఎక్కువ శాతం మంది Year ప్రీమియర్లను ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఇయర్ ప్రీమియం చెల్లించే గడువు వచ్చినా.. దానిని నిర్లక్ష్యం చేస్తారు. ఆ తర్వాత గడువు డేట్ ను మర్చిపోవడంతో ఇన్సూరెన్స్ కట్టడానికి వెళ్తే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఇన్సూరెన్స్ తీసుకునే ముందే పాలసీ ఏజెంట్ తో ఓ విషయంపై స్పష్టంగా తెలుసుకోండి.. అదేంటంటే..?

ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని విక్రయించేందుకు ఏజెంట్లు కూడా పుట్టుకొస్తున్నారు. అయితే వ్యాధులు కూడా పెరిగిపోవడంతో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని లైఫ్ టైం ఇన్సూరెన్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో ధ్రువపత్రాలను సరైన విధంగా పరిశీలించాలని కొన్ని సంస్థలు చెబుతూ ఉంటాయి. అయినా సరే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ఆత్రుతలో కొన్ని విషయాలను మర్చిపోతూ ఉంటాం.

వీటిలో ప్రధానంగా Grace Period గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. గ్రేస్ పీరియడ్ అనే విషయం చాలామంది కి అవగాహన ఉండదు. ఒక పాలసీదారుడు గడువులోగా డబ్బులు చెల్లించకపోయిన మరో 30 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ ను ఇస్తారు. ఈ గ్రేస్ పీరియడ్ ఒక సంవత్సరం పాలసీకి 30 రోజుల గడువు ఉంటుంది. అలాగే నెలనెలా ప్రీమియం చెల్లించే వారికి 15 రోజుల వరకు ఉంటుంది. అయితే కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు ఈ గ్రేస్ పీరియను ఇవ్వడానికి నిరాకరిస్తాయి. ఈ క్రమంలో పాలసీదారుడు గడువులోగా ప్రీమియం చెల్లించకపోతే అదనంగా పెనాల్టీ విధిస్తారు.

ఉదాహరణకు ఒక పాలసీదారుడు లైఫ్ టైం లేదా హెల్త్ పాలసీ తీసుకున్నట్లయితే.. దానికి సంబంధించిన ప్రీమియం ఒక తేదీన చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని పనులు లేదా మరికొన్ని కారణాలవల్ల గడువు తేదీలోగా చెల్లించకపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో తర్వాత చేరుకున్న పాలసీదారుడు ఆ ప్రీమియంను చెల్లించడానికి వెళ్తే కొన్ని సంస్థలు పెనాల్టీగా రూ. 5000 గా విధించిన సంఘటనలు ఉన్నాయి. అయితే పాలసీ కంటిన్యూ కావాలంటే పెనాల్టీ కట్టాలని లేదా మరో కొత్త పరిస్థితి తీసుకోవాలని కొందరు చెబుతూ ఉంటారు.

కానీ IRDA రూల్స్ ప్రకారం ప్రతిపాలసీదారుడు గడువులోగా ప్రీమియం చెల్లించకపోయిన గ్రేస్ పీరియడ్ ను ఉంచాలని చెప్పారు. దీనిని అన్ని పాలసీ సంస్థలు పాటించాల్సి ఉంటుంది.ఇలా ఒక నెల వరకు గ్రేస్ పీరియడ్ ఉండడం వల్ల వినియోగదారుడు పాలసీదారుడు ఎలాగైనా నగదును తీసుకొచ్చి ప్రీమియంలో చెల్లించుకోవచ్చు. ఇలా ప్రీమియం చెల్లిస్తే ఒక్క రూపాయి కూడా అదనంగా పెలాల్టీ పడదు. అయితే అవగాహన లేని వారి నుంచి కొందరు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అందువల్ల ఏ పాలసీ తీసుకున్న ముందుగా ఈ విషయాన్ని గుర్తించాలని కొందరు నిపుణులు తెలుపుతున్నారు.