Vastu Tips: మనదేశంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు కొనాలన్నా కట్టుకోవాలన్నా వాస్తు పాటించాల్సిందే. వాస్తు ప్రకారం అన్ని ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇబ్బందులే ఎదురవుతాయి. ప్రస్తుత కాలంలో వాస్తుకు అంతటి విలువ ఇస్తున్నారు. ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉంచుకోవాలో కూడా వాస్తు తెలియజేస్తుంది. ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉంచుకుంటే శుభప్రదంగా ఉంటుంది. దీంతో ఎంతో కలిసి వస్తుందని భావిస్తుంటారు. మరి ఏ జంతువులు ఇంట్లో ఉంచుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుని మరీ వాటిని ఉంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

ఇంట్లో చేపలు ఉంచుకుంటే అంతా మంచే జరుగుతుంది. చేప మహావిష్ణువు అవతారం అయినందునే ఇంట్లో చేపలు పెంచుకోవడం శుభశకునంగా భావిస్తారు. ఇంట్లో చేపలు ఉంటే అన్ని రకాల కష్టాలు దూరం అవుతాయి. అందుకే ఇంట్లో చేపలు పెంచుకోవడానికి మొగ్గు చూపడంలో తప్పులేదు. దీనికి అందరు ఏకీభవించి చేపలను అక్వేరియంలో గానీ ఇతర మార్గాల్లో కానీ పెంచుకోవడం తప్పనిసరి. దీంతో మనకు ఎలాంటి ఇబ్బందులు రావని నమ్ముతుంటారు. వాస్తు ప్రకారం చేపలు పెంచుకోవడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు.
తాబేలును ఇంట్లో పెంచుకోవడం శుభప్రదంగానే చూస్తారు. తాబేలు ఇంట్లో ఉండటం వల్ల వ్యాధులు దూరం అవుతాయి. నిజమైన తాబేలుకు బదులుగా ఇత్తడి లేదా గాజుతో చేసిన తాబేలును ఇంట్లో ఉంచుకోవడం మంచిదేనని చెబుతున్నారు. ఇంట్లో తాబేలు ఉండటం వల్ల సంపద పెరుగుతుంది. తాబేలు కూడా దేవుళ్లకు ప్రతీకగా చెబుతారు. తాబేలు దాదాపు 800 ఏళ్లు బతుకుతుంది. అంతటి మహత్తర శక్తి గల తాబేలును ఇంట్లో ఉంచుకోవడం ఉత్తమం. ఇలా తాబేలును పెట్టుకోవడం వల్ల మనకు అనేక లాభాలు వస్తాయని చెబుతున్నారు.

ఇంట్లో కుక్కను పెంచుకోవడం కూడా మంచి శకునంగా చూస్తారు. కుక్కను సాక్షాత్తు బైరవ బాబాగా పిలుస్తుంటారు. కుక్కకు రొట్టెలు తినిపించడం ద్వారా పలు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో గుర్రాలను పెంచుకోవడం కూడా శుభప్రదమే. వాటిని విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో గుర్రాలు పెంచుకోవడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. నిజమైన గుర్రం లేకపోతే బొమ్మను కూడా ఉంచుకోవచ్చు. ఇలా ఈ ఐదు రకాల జంతువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు ఎన్నో మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతుంటారు.
[…] Also Read: Vastu Tips: ఇంట్లో ఈ ఐదు ఉంటే అన్ని శుభాలే.. […]