Unstoppable Ram Charan-KTR: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ రెండవ సీజన్ ఇప్పుడు చివరి దశకి వచ్చింది..మొన్నీమధ్యనే ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 1 స్ట్రీమింగ్ అవ్వగా , పార్ట్ 2 జనవరి 6 వ తేదీన స్ట్రీమ్ కాబోతుంది..వీటితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన ఎపిసోడ్ కూడా అతి త్వరలోనే ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది..ఇక ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ కి నేటి తరం స్టార్ హీరోలందరూ దాదాపుగా హాజరు అయ్యారు.

మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ప్రభాస్ ,అల్లు అర్జున్ ఇలా ఆరు మంది స్టార్ హీరోస్ నలుగురు స్టార్ హీరోలు వచ్చేసారు..ఇక మిగిలింది రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మాత్రమే..ఈ ఇద్దరు #RRR హీరోలు ఇప్పటి వరకు హాజరు కాలేదు, అయితే ఇప్పుడు తదుపరి ఎపిసోడ్ కి రామ్ చరణ్ తన చిరకాల మిత్రుడు , తెలంగాణా IT శాఖా మంత్రి KTR తో హాజరు కాబోతున్నాడు.
ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ త్వరలోనే జరగబోతుంది..ఈ నెలలోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం..ఇక పవన్ కళ్యాణ్ తో షూట్ చేసిన ఎపిసోడ్ తో ఈ సీజన్ ముగుస్తుందట..ఇక వచ్చే సీజన్ ప్రారంభ ఎపిసోడ్ లో జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లు వస్తారట..అలా నేటి తరం స్టార్ హీరోలందరిని అన్ స్టాపబుల్ షో కవర్ చేసేసింది.

కానీ బాలయ్య తరం నాటి టాప్ స్టార్స్ మాత్రం ఇప్పటివరకు రాలేదు..ఈ సీజన్ లో చిరంజీవి , వెంకటేష్ మరియు నాగార్జున వస్తారు అనుకున్నారు, కానీ అది కుదర్లేదు..అయితే ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మరియు వీరసింహా రెడ్డి వంటి సినిమాలు విడుదల అవుతున్నాయి కాబట్టి ఈ రెండు మూవీస్ టీమ్స్ కలిసి ఒక ఎపిసోడ్ చేసే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తుంది.