Woman Marriage Age: కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల వివాహ వయసు 21 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. దీంతో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఆడవారి ఎదుగుదలకు ఆర్థిక పరిపుష్టికి కూడా దోహదపడే బిల్లుగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2006 నాటి బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆడ, మగ వారి వివాహ వయసు ఒకటే కావడం గమనార్హం. దీంతో ఆడపిల్లలు జీవితంలో ఎదిగేందుకు పరోక్షంగా ఈ బిల్లు సాయపడుతుందని తెలుస్తోంది.
హిందూ, ముస్లిం, క్రైస్తవ, పార్సీ ఏ మతమైనా చట్టాన్ని పాటించాల్సిందే. వివాహ వయసు విషయంలో అందరు విధిగా బిల్లును అనుసరించి 21 ఏళ్లు వచ్చే వరకు ఆగాల్సిందే. దీంతో మహిళల్లో కూడా హర్షం వ్యక్తం అవుతోంది. చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండటంతో కేంద్రం తీసుకున్న నిర్ణయం సముచితంగా ఉందని అందరి నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వివాహ వయసు పెంపుపై కొన్ని వర్గాల్లో నిరసన వ్యక్తమవుతున్నా కేంద్రం మాత్రం ఈ బిల్లు ఆచరణకే మొగ్గు చూపుతోంది. దేశ వ్యాప్తంగా ఈ బిల్లును అమలు చేసేందుకు నిర్ణయించింది. దీంతో అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఆడవారి వివాహ వయసు 18 ఏళ్లు ఉండగా మన దేశంలో 21 గా మార్చడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నా కేంద్రం నిర్ణయాన్ని అందరు స్వాగతించడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో వివాహ వయసు పెంపు బిల్లుపై నిరసన మొదలైంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ బీజేపీ తీసుకున్న నిర్ణయం సహేతుకం కాదని వాదిస్తోంది. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడంపై విమర్శలు చేస్తోంది. మహిళా సాధికారత కోసమే బిల్లును తీసుకొచ్చామని చెబుతున్నా కేంద్రం దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తోంది.
ఆరోగ్యకారణాల రీత్యా మహిళల వివాహ వయసు పెంపు సబబే అని అన్ని వర్గాల్లో మంచి అభిప్రాయం వస్తున్నా కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత రావడం వారి తెలివితక్కువ తనానికే నిదర్శనమని తెలుస్తోంది. గతంలో జరిగిన బాల్య వివాహాలతో ఆడపిల్లలు పడిన కష్టాలను చూసే కనీస వయసు పెంపుపై ఓ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. పెళ్లీడు రాకముందే వివాహాలు చేయడంతో వారి ఆరోగ్యం దెబ్బతింటోందని తెలుస్తోంది.
Also Read: అరటి పండుతో పాటు మిగిలిన పండ్లను ఒకే చోట పెడుతున్నారా.. ఇది తెలిస్తే ఇకపై ఆ తప్పు చేయరు!
బేటీ పడావో బేటీ బచావో అనే సందేశంతో ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా వారిని తీర్చిదిద్దేందుకు కావాల్సిన సమయం తల్లిదండ్రులకు ఉండాల్సిందే. అందుకే వారి కనీస వివాహ వయసు పెంచుతూ కేంద్రం తీసుకొచ్చిన చట్టంతో వారు జీవితంలో ఎదిగేందుకు కూడా దోహదపడనుంది. మైనార్టీలను వేధించడానికే ఈ చట్టం తీసుకొచ్చినట్లు అసత్య ప్రచారం చేయడం వారి అనైతికతకు నిదర్శనమే అని తెలుస్తోంది.
కేంద్రం తీసుకొచ్చిన వివాహ వయసు పెంపు ప్రతిపాదనపై అందరిలో అనవసర భయాలు నెలకొంటున్నాయి. వారు మంచి స్థాయిలోకి వచ్చాక పెళ్లి చేసుకుంటే భర్తతో కూడా ఇబ్బందులు ఉండవని తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని భారతీయులందరు ఒప్పుకోవాల్సిందే. వారి అభ్యున్నతికి సహకరించాల్సిందే.
Also Read: ముల్లంగి ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. వాళ్లు తినకూడదట!