Shyam Singha Roy Collections: రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. అయితే, రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి వీక్ డేస్ లో స్టడీగా ఏవరేజ్ కలెక్షన్స్ ను రాబడుతుంది. ముఖ్యంగా ఈ సినిమా న్యూ ఇయర్ హాలిడేస్ ను బాగా క్యాష్ చేసుకుంది.
మరోపక్క ఆంధ్ర ప్రదేశ్ లో థియేటర్ల పరిస్థితి అంతగా బాగోలేకపోయినా అక్కడ కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఏది ఏమైనా ఈ సినిమాకి ఫస్ట్ షో నుంచి ఫుల్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అఖండ, పుష్ప సినిమాల కంటే కూడా శ్యామ్ సింగరాయ్ కే ఎక్కువ పాజిటివ్ టాక్ వచ్చింది. విమర్శకులు సైతం ఇది అద్భుతమైన ప్రయోగాత్మక సినిమా అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
ఈ చిత్రం 10 రోజుల కలెక్షన్ల వివరాలను ఓసారి గమనిస్తే :
నైజాం 9.00 కోట్లు
సీడెడ్ 2.45 కోట్లు
ఉత్తరాంధ్ర 2.10 కోట్లు
ఈస్ట్ 0.96 కోట్లు
వెస్ట్ 0.82 కోట్లు
గుంటూరు 1.17 కోట్లు
కృష్ణా 0.91 కోట్లు
నెల్లూరు 0.58 కోట్లు
ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 17.99 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.90 కోట్లు
ఓవర్సీస్ 3.40 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 24.29 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
Also Read: ‘శ్యామ్ సింగరాయ్’ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !
అన్నట్టు ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రాన్ని నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు కాబట్టి.. ఈ సినిమా లాభనష్టాలన్నీ నిర్మాతకే సొంతం. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 1.7 కోట్ల షేర్ ను రాబట్టాలి. అయితే ఏపిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా చాలా చోట్ల థియేటర్లు మూతపడటం జరిగింది. ఈ వీకెండ్ తో ‘శ్యామ్ సింగ రాయ్’ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం కనిపిస్తుంది.
నేచురల్ స్టార్ నానికి మొత్తానికి సాలిడ్ హిట్ వచ్చింది. నాని గత మూడు చిత్రాలు గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీశ్ అనుకున్నంత విజయం సాధించలేదు. పైగా ఆ సినిమాల కారణంగా నాని మార్కెట్ కూడా పడిపోయింది. ఈ నేపథ్యంలో నానికి సూపర్ హిట్ తప్పనిసరి అయింది. దాంతో ఎలాగైనా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ హిట్ కోసం ఎంతో కసితో చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా హిట్ అవ్వడంతో నాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read: అదిరిపోయే కలెక్షన్లు రాబడుతున్న ‘శ్యాం సింగ రాయ్’