Site icon OkTelugu

Jabardasth Show: జబర్దస్త్ కి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన అనసూయ… సెల్ఫ్ సెటైర్ తో నవ్వులు పూయించిన సుడిగాలి సుధీర్ !

Jabardasth Show: జబర్దస్త్ షో తెలుగు ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై సూపర్ హిట్ కామెడీ షో గా దూసుకుపోతూ… ఎంతో మంది కమెడియన్స్ ని బుల్లితెరకు పరిచయం అయ్యేలా చేసింది. పలువురు ఈ షో ద్వారా ప్రేక్షకులను తమ నటనతో నవ్విస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం వెండి తెరపై కూడా తమదైన శైలిలో నటిస్తూ పలు అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. అనసూయ, రష్మి గౌతమ్ ఈషో తోనే యాంకర్లుగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చారు.

అయితే జబర్దస్త్ షో లాస్ట్ రెండు ఎపిసోడ్స్‌కు రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేశారు. పలు అనివార్య కారణాల వల్ల అనసూయ అందుబాటులో లేకపోవడంతో రష్మి నే యాంక‌ర్‌ గా చేశారు. కాగా కొత్త ఏడాదిలో జనవరి 6న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్‌ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ‘ఏ బిడ్డా… ఇది జబర్దస్త్ సరికొత్త అడ్డా’ అంటూ అనసూయ ‘జబర్దస్త్’కు మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో ‘జబర్దస్త్’ కోసం కొత్త సెట్‌ ను కూడా రెడీ చ్రెసినట్లు మనం ఇందులో గమనించొచ్చు.

ఇక హైపర్ ఆది స్కిట్‌లో రోల్ చేసిన సుడిగాలి సుధీర్ తన మీద తానే పంచ్ వేసుకున్నాడు. ఆ సెల్ఫ్ సెటైర్ కి ఒక్కసారిగా అంతా నవ్వుకున్నారు. ‘మానవా… మానవా’ అంటూ లేడీ గెటప్ వేసిన శాంతి దగ్గరకు రాగానే… “ఆల్రెడీ ‘ఢీ’ మానాను. ఇంకేం మానాలి రా బాబు’ అని సుధీర్ అనడంతో అందరూ కడుపుబ్బా నవ్వారు.

Exit mobile version