Lychee fruits : పరగడుపున లీచీ పండ్లు తింటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త!

ఈ పండ్లను రసాయనాలతో పండించకపోయిన ఇందులో సహజ రసాయనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. మిగతా పండ్లలా వీటిని అసలు తినకూడదు. తింటే ప్రమాదాల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ లీచీ పండ్లను తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : September 25, 2024 10:36 am

Lychee fruits

Follow us on

Lychee fruits : లీచీ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చూడటానికి స్ట్రాబెరీలా ఉండే ఈ పండ్లు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఇందులోని పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుందని కొందరు నమ్ముతారు. కానీ వీటిని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లను ఎక్కువ రసాయనాలతో పండించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పండ్లను రసాయనాలతో పండించకపోయిన ఇందులో సహజ రసాయనాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. మిగతా పండ్లలా వీటిని అసలు తినకూడదు. తింటే ప్రమాదాల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ లీచీ పండ్లను తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో చూద్దాం.

పరగడుపున తింటే ప్రాణమే పోవచ్చు
మిగతా పండ్లలా లీచీ పండ్లను పరగడుపున అసలు తినకూడదు. ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల కొన్నిసార్లు ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు వ్యాపారులు లాభాలు రావాలని లీచీ పండ్లకు ఎర్ర రంగు వేసి అమ్మేస్తున్నారు. పైకి ఎర్రగా ఉన్నా, లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి. ఇలాంటి వాటిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలకు అయితే వీటిని అసలు ఇవ్వకపోవడం మంచిది.

మెదడు వాపు వ్యాధి
ఈ పండ్లలో ఎక్కువగా ఎక్యూట్ ఎన్‌సెఫలైటిస్ సిండ్రోమ్ ఉంటుంది. దీనివల్ల మెదడువాపు వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లీచీ పండ్లలో విషపదార్థం ఉంటుంది. ఇది మెదడు వాపు రావడానికి కారణం అవుతుంది. వీటిని తగినంత ఉష్ణోగ్రతలో మాత్రమే ఉంచాలి. ఈ లీచీ పండ్లు 65 నుంచి 80 శాతం తేమతో ఉన్నట్లయితే ఆరోగ్యానికి హాని చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.

షుగర్ స్థాయిలు
లీచీ పండ్లు తిన్నప్పడు వీటి గింజలను కొందరు తింటారు. వీటిలో విష పదార్థాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పొరపాటున ఈ గింజలను తింటే వెంటనే శరరంలో షుగర్ స్థాయిలు పడిపోతాయి. పండు లేదా పచ్చివి తిన్న ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. గర్భిణులు అయితే వీటిని పూర్తిగా తినకపోవడం చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

మిథిలెన్ సైక్లోప్రోపిల్-గ్లైసిన్
ఈ పండ్లలో ఎక్కువగా హైపో‌గ్లైసెమిక్ ఎన్‌సెఫాలోపతీ ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గిపోతాయి. ఇందులో ఉండే మిథిలెన్ సైక్లోప్రోపిల్-గ్లైసిన్ అనే రసాయనం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నవారు.. లీచీ పండ్లను తినడం వల్ల చక్కెర స్థాయిలు తగ్గి ప్రమాదాన్ని పెంచడంతో పాటు మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో.. అంత కంటే ఎక్కువగా నష్టాలు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండు తింటే అనారోగ్య సమస్యలు కోరి తెచ్చుకున్నట్లే.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.