https://oktelugu.com/

భార్య పైన అనుమానంతో ఆ భర్త చేసిన పని వింటుంటే కనీళ్ళు ఆగవు ..!

భార్య భర్తల జీవితం అన్న తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఈ క్రమంలోనే వారి మధ్య తరచూ గొడవలు వస్తున్న ఆ తర్వాత వాటిని మర్చిపోయి సంతోషంగా ఉండాలని చెబుతారు. కానీ ప్రస్తుత కాలంలో క్షణికావేశంలో ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో అందమైన వారి జీవితానికి అతి తక్కువ సమయంలోనే ముగింపు పలుకుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నివసించే నాగరాజు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 18, 2021 / 02:04 PM IST
    Follow us on

    భార్య భర్తల జీవితం అన్న తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఈ క్రమంలోనే వారి మధ్య తరచూ గొడవలు వస్తున్న ఆ తర్వాత వాటిని మర్చిపోయి సంతోషంగా ఉండాలని చెబుతారు. కానీ ప్రస్తుత కాలంలో క్షణికావేశంలో ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎంతో అందమైన వారి జీవితానికి అతి తక్కువ సమయంలోనే ముగింపు పలుకుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

    ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నివసించే నాగరాజు విజయ దంపతులకు 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.నాగరాజు కార్ డ్రైవర్ గా పని చేస్తుండగా విజయ పట్టణంలోని ఒక హోటల్ నిర్వహిస్తోంది. అయితే తన భార్య ఎవరితో మాట్లాడిన నాగరాజు తనని అనుమానించే వాడు. ఇలా తన భార్య పై అనుమానాలు రావడంతో 2 సంవత్సరాల క్రితం వీరి ఉంటున్న గ్రామం నుంచి సత్తుపల్లికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే నాగరాజు సోమవారం మధ్యాహ్నం తన పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చారు.

    అయితే ఆ సమయంలో తన భార్య విజయ ఫోన్లో మాట్లాడుతూ ఉండడం చూసి ఎంతో ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు అని తన భార్యను నిలదీయడంతో ఎవరు లేదని సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే వీరి మధ్య మాటా మాటా పెరిగి పెద్ద గొడవకు దారి తీసింది. ఈ క్రమంలోనే నాగరాజు ఆవేశంతో విజయ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఇరుగుపొరుగు వారికి తన భార్య ఉరి వేసుకుని చనిపోయిందని నమ్మించారు. అయితే అతనిపై ఇరుగుపొరుగు వారికి అనుమానం రావడంతో ఈ విషయాన్ని పోలీసులకు చేరగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నాగరాజును అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పెట్టారు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

    ఇవి కూడా చదవండి: రాశిని బట్టి మీరు పెళ్లి చేసుకోవాలనుకునే వారు ఎలా ఉంటారో తెలుసా?