KCR Cabinet Expansion: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను గుర్తించి మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. ఆశావహులకు పదవులు ఏ మేరకు దక్కుతాయోనని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ఎంత మందికి స్థానం ఖరారవుతుందని మరెంతమంది నిరాశలో మునిగిపోతారో తెలియడం లేదు.

వరంగల్ కు చెందిన బండ ప్రకాశ్ ను ఎమ్మెల్సీ పదవి వరించగా ఆయనకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మంత్రులుగా కొనసాగుతుండటంతో వీరి సంఖ్య మూడుకు చేరనుంది. కానీ ఎస్సీ కోటాలో కడియం శ్రీహరికి కూడా మంత్రి పదవి వస్తుందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో అనే సంశయాలు నెలకొన్నాయి.
ఇక సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి కూడా మంత్రి పదవి ఖాయమని తెలుస్తున్న క్రమంలో కేబినెట్ లో మార్పులు అనివార్యమనే ప్రచారం సాగుతోంది. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం సందర్భంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే ఆరుగురు ఉండటంతో వీరిలో పదవి ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ అందరిలో వస్తోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీ మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను మంత్రి వర్గ విస్తరణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు సమాచారం.
Also Read: KCR vs BJP: ఏంది బై ఇదీ! ఈ బీజేపీవోళ్లున్నారే.. కేసీఆర్ ను రోడ్డునపడేస్తారా?
సామాజిక సమీకరణలకే పెద్ద పీట వేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలో సమర్థులైన వారికే స్థానం కల్పించి ప్రభుత్వాన్ని మరోమారు అధికారంలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణపై తన మార్కు ఉండేలా కేసీఆర్ తపన పడుతున్నట్లు సమాచారం. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇన్నాళ్లు మంత్రివర్గాన్ని మార్చకుండానే నెట్టుకొచ్చిన సీఎం ప్రస్తుతం మార్పులకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: భార్య పైన అనుమానంతో ఆ భర్త చేసిన పని వింటుంటే కనీళ్ళు ఆగవు ..!