Homeలైఫ్ స్టైల్Kala Bhairava: మన తలరాతను మార్చే దేవుడెవరో తెలుసా?

Kala Bhairava: మన తలరాతను మార్చే దేవుడెవరో తెలుసా?

కాలభైరవుడిని శనివారం ఉదయం 5 నుంచి 6 గంటల సమయంలో ఆరాధించాలి. స్వామికి దీపారాధన అంటే ఎంతో ఇష్టం.

Kala Bhairava: మన కష్టాలు దూరం చేసే దేవుళ్లలో కాలబైరవుడు కూడా ఉంటాడు. ఈయనను పూజిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి. కాలబైరవుడిని ఆరాధిస్తే విశిష్టమైన ఫలితాలు వస్తాయి. బాదలు, ఇంట్లో సమస్యలు దూరం చేయడంలో కాలభైరవుడు ముందుంటాడు. అందుకే పండితులు కాలభైరవుడిని ఆరాధించాలని చెబుతుంటారు. శునకాన్ని కాల భైరవుడు అంటారు. అది దేవుడితో సమానం.

ఎలా పూజించాలి

కాల భైరవుడిని ఎలా పూజించాలి. ఏ రోజున పూజ చేస్తే మంచి జరుగుతుంది. శునకం మీద నాలుగు భుజాలతో త్రిశూలం, కపాలి, అభయ ముద్ర, అగ్నిహోత్రం పట్టుకుని కూర్చుంటాడు. కాలభైరవుడి అనుగ్రహం ఉంటే కాశీలో కూడా అడుగు పెట్టగలమని చెబుతుంటారు. కాలభైరవుడి కరుణ లేకపోతే కాశీకి వెళ్లలేమని అంటారు. ఇలా కాలభైరవుడిని మనం ఆరాధించే క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

ఆరాధన

కాలభైరవుడిని శనివారం ఉదయం 5 నుంచి 6 గంటల సమయంలో ఆరాధించాలి. స్వామికి దీపారాధన అంటే ఎంతో ఇష్టం. బూడిద గుమ్మడికాయను సగం కట్ చేసి లోల కొద్ది భాగాన్ని తొలగించి అందులో నువ్వుల నూనె పోసి అందులో తోక మిరియాలు వేయాలి. తరువాత ఎర్రని వస్త్రంతో వత్తిని వేసి నూనెలో ఉంచాలి. బూడిద గుమ్మడికాయను రాళ్ల ఉప్పు పోసి దానిపై ఉంచాలి. దీపాన్ని వెలిగించి స్వామి వారికి చూపిస్తే మన కష్టాలు దూరమవుతాయి.

అన్ని రాశు వారు

27 నక్షత్రాలు, 12 రాశుల వారు కాలభైరవుడిని పూజించొచ్చు. అటుకులు, కొబ్బరి, పాలు, పంచదార, బెల్లం నైవేద్యంగా పెడితే మంచిది. స్వామి వారిని పూజించడం వల్ల కష్టాలను తొలగించుకోవచ్చు. భోగభాగ్యాలు కలుగుతాయి. ఇలా కాలభైరవుడిని ఆరాధించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Oktelugu Epaper