https://oktelugu.com/

Sleep Tips for Kids: మీ పిల్లలకు నాణ్యమైన నిద్రను ఇలా అందించండి

Sleep Tips for Kids: మీ పిల్లలకు కచ్చితంగా ఎనిమిది గంటల నిద్ర అవసరం. లేదంటే వారి ఆరోగ్యం సరిగ్గా ఉండదు అంటున్నారు నిపుణులు. అందుకే ప్రతి రోజు ఒక సమయం పెట్టుకొని వారిని నిద్రపుచ్చి మళ్లీ సరిగ్గా ఉదయం కూడా ఒక సమయం పెట్టుకొని నిద్ర లేపాలి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 11, 2024 5:44 pm
    Sleep Tips for Kids

    Sleep Tips for Kids

    Follow us on

    Sleep Tips for Kids: ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులకు ఎక్కువ కమ్యూనికేషన్ ఉండటం లేదు. ఒకప్పుడు కేవలం పనులు ఇంటికి వచ్చాక కాసేపు ఇరుగుపొరుగు వారితో మాట్లాడి పిల్లలో టైమ్ స్పెండ్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఈ సమయాన్ని, ప్రజల జీవన విధానాన్ని ఫోన్ మొత్తం మార్చేసింది. ఇక పిల్లల విషయంలో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉంటే వారి చేతిలో కచ్చితంగా ఫోన్ ఉంటుంది. తల్లిదండ్రులు పక్కనే ఉంటారు. కానీ అందరి చేతిలో ఫోన్ ఉంటుంది. పిల్లలతో గడపడం తక్కువ. ఫోన్ తో ఉండటం ఎక్కువ.

    అయితే మీ పిల్లలకు కచ్చితంగా ఎనిమిది గంటల నిద్ర అవసరం. లేదంటే వారి ఆరోగ్యం సరిగ్గా ఉండదు అంటున్నారు నిపుణులు. అందుకే ప్రతి రోజు ఒక సమయం పెట్టుకొని వారిని నిద్రపుచ్చి మళ్లీ సరిగ్గా ఉదయం కూడా ఒక సమయం పెట్టుకొని నిద్ర లేపాలి. వారిని కొన్ని రోజుల పాటు అదే విధంగా ట్రైన్ చేస్తే వారికి అదే సమయానికి నిద్ర వస్తుంది. మేల్కుంటారు కూడా. మరి పిల్లలను నిద్ర పుచ్చడం అంత సులభం కాదు కదా. ఇంతకీ మీ పిల్లలు ఎలా నిద్రపోతారు. ఎలా పడుకున్నా మీ వంతు కృషి మీరు చేస్తే వారికి త్వరగా నిద్ర వస్తుంది. ఓ సారి పిల్లలు త్వరగా నిద్ర పోవాలంటే ఏం చేయోలో చూసేయండి.

    స్నానం
    ప్రతి ఒక్కరికి స్నానం చేయడం వల్ల రిలాక్స్ గా ఉంటుంది. ఇక అదే విధంగా రాత్రి నిద్రకు ముందు స్నానం చేస్తే కూడా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. మూడ్ మారిపోతుంది. స్కూల్‌కు వెళ్లి వచ్చిన చిన్నారులు ఎనర్జిటిక్‌గా ఉండాలంటే సాయంత్రం స్నానం అలవాటు చేయండి. బయట ఆటలు ఆడి వచ్చిన తర్వాత స్నానం చేస్తే చాలా విశ్రాంతిగా అనిపిస్తుంది. రాత్రి మంచి నిద్ర పడుతుంది.

    బ్రషింగ్
    మీరు ఉదయం మాత్రమే బ్రష్ చేస్తారా. పిల్లలకు రాత్రి నిద్రపోయే ముందు పళ్లు తోముకోవడం వంటి సెల్ఫ్ కేర్ హ్యాబిట్స్ కూడా నేర్పించారంటే వారికి ఒక మంచి అలవాటు అవుతుంది. ఈ అలవాట్లు పరిశుభ్రతపై అవగాహన పెంచుతుంటాయి కూడా. నిద్రపోయే ముందు బ్రష్ చేసుకుంటే పాచి, బ్యాక్టీరియా పోయి.. పళ్లు పుచ్చిపోవడం, నోటి దుర్వాసన వంటి సమస్యల నుంచి మీ పిల్లలు దూరంగా ఉంటారు.

    పుస్తకాలు చదివి వినిపించడం
    పిల్లలకు పుస్తకాలు చదవడం వస్తే సూపర్.లేదంటే మీ పిల్లలు పడుకునే ముందు పుస్తకాలు చదివి వినిపించడం. లేదంటే మీకు తెలిసిన కథలు చెప్పండి. ఈ అలవాటు తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాన్ని కూడా పెంచుతాయి. కథలు వింటూ పిల్లలు కొత్త ఊహా లోకంలోకి వెళ్తారు. దీనివల్ల వారి ఇమేజినేషన్ పవర్ పెరుగుతుంది. చిన్నారుల క్రియేటివిటీ, నాలెడ్జ్ కూడా పెరుగుతుంది.

    వాటర్ బాటిల్
    రాత్రి పిల్లలు నిద్ర లేచినప్పుడు దాహం వేస్తుంటుంది. అందుకే వారి బెడ్ దగ్గర వాటర్ బాటిల్ కచ్చితంగా పెట్టండి. పిల్లలు సరిగా నీరు తాగకుండా డీహైడ్రేట్ అయితే అలసట, తలనొప్పి వంటి సమస్యలు బాధ పెడుతాయి. ఇవి వారిని సరిగ్గా నిద్ర పోనివ్వవు. వాటర్ ఎక్కువగా తాగితే పిల్లల్లో మలబద్ధకం వస్తుంది. వారి స్కిన్ హెల్త్ కూడా బాగుండదు. సో వాటర్ మస్ట్.

    నో ఫోన్: పడుకునే ముందు పిల్లలకు ఫోన్లు ఇస్తుంటే ఇకనైనా మానేయండి. అలాగే టీవీ, కంప్యూటర్ వంటి బ్రైట్ స్క్రీన్స్ చూడకుండా మీరే జాగ్రత్త పడాలి. ఇలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ నుంచి వచ్చే బ్లూ లైట్, పిల్లల నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అందుకే వారు పడుకున్న వెంటనే నిద్ర పట్టేలా బెడ్ రూమ్ సెట్ చేసి పడుకోబెట్టాలి. వారికి ఏవైనా నిద్ర సమస్యలు ఉంటే డీప్ బ్రీతింగ్ మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పిస్తే వెంటనే పడుకుంటారు.