https://oktelugu.com/

Bollywood Director: ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ చేయబోతున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్…

Bollywood Director: ఒక షారుఖ్ ఖాన్ ను మినహాయిస్తే మిగిలిన స్టార్ హీరోలందరూ పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోతున్నారు. ఇక స్టార్ట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజకుమార్ హీరాని సైతం 'డంకి' సినిమాతో సూపర్ సక్సెస్ ఆదుకుంటాడని అందరూ అనుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 11, 2024 / 05:23 PM IST

    Bollywood star director who is going to make a sequel to that super hit movie...

    Follow us on

    Bollywood Director: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఇప్పటికీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ తెలుగు సినిమా హీరోలు కొట్టిన దెబ్బకి కోలుకోలేకపోతుంది. వరుసగా బాలీవుడ్ స్టార్ హీరోలందరూ సినిమాలు చేస్తున్నప్పటికీ వాళ్ళ సినిమాలు ఏవి సక్సెస్ సాధించకపోగా డిజాస్టర్ గా మిగులుతున్నాయి. ఒక షారుఖ్ ఖాన్ ను మినహాయిస్తే మిగిలిన స్టార్ హీరోలందరూ పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోతున్నారు. ఇక స్టార్ట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజకుమార్ హీరాని సైతం ‘డంకి’ సినిమాతో సూపర్ సక్సెస్ ఆదుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఆయన కూడా ఈ సినిమాతో ఘోరంగా ఫేలవడమే కాకుండా చాలా విమర్శలను కూడా ఎదుర్కొన్నాడు. ఇక షారుక్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులు మెప్పించకపోగా పలు విమర్శలకు సైతం కేంద్ర బిందువుగా మారింది.

    ఇక ఇలాంటి క్రమంలోనే రాజ్ కుమార్ హీరాని తన సూపర్ హిట్ సినిమా అయిన ‘త్రీ ఇడియట్స్ కి సీక్వెల్ గా ఒక సినిమాని చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన కెరియర్ లో తీసిన అన్ని సినిమాల్లోకి త్రీ ఇడియట్స్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇండియా మొత్తంలో మొదటగా 500 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాగా కూడా ఈ సినిమా భారీ రికార్డుని క్రియేట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను అమీర్ ఖాన్ తో చేస్తాడా లేదా మరి వేరే హీరోతో చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే బాలీవుడ్ ఇండస్ట్రీని ఆదుకోవడానికి అటు హీరోలు, ఇటు దర్శకులు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి ఏవి కూడా వర్కౌట్ అవ్వట్లేదనే చెప్పాలి.

    ఇక మొత్తానికైతే వీళ్లు చేస్తున్న ప్రయత్నాలు ఏవి సఫలం కావడం లేదు. ఇక దానికి తోడుగా తెలుగు సినిమా హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ లా మీద సక్సెస్ లు కొట్టడం కూడా బాలీవుడ్ వాళ్లకి ఒక వంతుకు శాపంగా మారుతుందనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యం లోనే రాజ్ కుమార్ హిరానీ సైతం కాపాడలేకపోయాడు అంటే ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు అప్పుడే కోలుకునే పరిస్థితుల్లో లేదని మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక షారుక్ ఖాన్ లాంటి హీరో జవాన్, పఠాన్ లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నప్పటికీ అందులో జవాన్ సినిమా తీసింది తమిళ్ సినిమా డైరెక్టర్ అట్లీ కావడం.

    అది కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడు కావడం విశేషం… మరి ‘త్రీ ఇడియట్స్’ సినిమా సీక్వెల్ ని చేయాలనుకుంటున్న రాజ్ కుమార్ హీరాని ఆ సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా లేదా త్రీ ఇడియట్స్ మొదటి పార్ట్ తో వచ్చిన పేరీ ను కూడా పోగొట్టుకుంటాడా అనే చూడాలి… ఇక అమీర్ ఖాన్ అయితే ఇప్పటివరకు మరొక సినిమాని అనౌన్స్ చేయలేదు. మరి త్రీ ఇడియట్స్ సీక్వెల్ చేస్తాడా లేదంటే కొత్త హీరోకి ఛాన్స్ ఇస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికి అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం చాలా స్ట్రగుల్స్ లో అయితే ఉంది.

    మరి వాళ్ళని కాపాడే హీరో, దర్శకుడు ఎవరు అనేది కూడా వాళ్లే నిర్ణయించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది… ఇక ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో కల్కి సినిమానే బాలీవుడ్ లో అత్యధికంగా 220 కోట్ల వసూళ్లను రాబట్టి ఇప్పటివరకైతే ఈ సంవత్సరంలో బాలీవుడ్ లో రిలీజైన అన్ని సినిమాల్లోకి టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది…