Heat Wave Causes: ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి. కొందరు వ్యాపారాలు కష్టంగా తమ కార్య కార్యాపాలను నిర్వహించుకుంటున్నారు. మరికొందరు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. అసలు గతంలో 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు అయితే ఎంతో భయపడి పోయేవారు. కానీ ఇప్పుడు చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రత నమోదు కావడం లేదు. కారణాలు ఏవైనా గతంలో కంటే ఇప్పుడు అధిక ఉష్ణోగ్రత లు నమోదు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వేడి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల అనేక అనారోగ్యాల బారిన పడే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితుల్లో చల్లదనం కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది..
పగలంతా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం.. రాత్రి సమయంలో ఉక్కపోకతో ఇబ్బందులు పడడం చాలా ప్రాంతాల్లో చూస్తున్నదే. ఇలా రాత్రి సమయంలో కూడా వేడి వాతావరణం ఉండడంతో సరైన నిద్ర పట్టడం లేదు. రాత్రి సమయంలో సాధారణం కన్నా 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ వాతావరణం లో శరీరానికి స్వచ్ఛమైన గాలి వచ్చే అవకాశం ఉండదు. ఈ సమయంలో వడకల్పులు ఎక్కువగా వస్తుంటాయి. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి రెండు నుంచి 8 రోజుల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చాలా రోజుల వరకు ఇలాంటి పరిస్థితి ఉంటున్నట్టు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.
మరి ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఇలాంటి వాతావరణాన్ని ఎక్కువ మంది అనుభవిస్తున్నారు. అయితే ఈ వేడి వాతావరణం పెరగడానికి గ్లోబలైజేషన్ లేదా ఇతర కారణాలు కావచ్చు. వీటితోపాటు కొన్ని అవసరాల కోసం చేసే పనులు కూడా వేడి వాతావరణం సృష్టిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆరు రోడ్ల నిర్మాణం, గాజులతో చేసిన నిర్మాణాలు వంటివి పగటి వేళలో ఉన్న వేడిని అధికంగా గ్రహించి.. రాత్రి సమయంలో అదే వాతావరణంలో ఉంచుతున్నాయి. అంతేకాకుండా పట్టణాలు, నగరాల్లో కిక్కిరిసిన నిర్మాణాలతో ఎలాంటి గాలి వాతావరణం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లోనే గాలిలో తేమ తక్కువ సరైన గాలి రాకపోవడంతో చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇలాంటి సమయంలో వేడి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ వేడి నుంచి తట్టుకోవడానికి ఇంటిపైన చల్లదనాన్ని ఇచ్చే పైకాపులను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంటి నిర్మాణం చేసే సమయంలోనే సూర్య రశ్మి పరావర్తనం చెంది Pavmentlu ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెంచుతూ ఉండాలి. చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల వేడి వాతావరణం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతి ఇంటికి వెంటిలేషన్ ఎక్కువగా ఉండేలా నిర్మాణం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉష్ణోగ్రత నుంచి తట్టుకునే అవకాశం ఉంటుంది.