Tollywood Director Died: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత,దర్శకుడు త్రిపురనేని వరప్రసాద్ (చిట్టిబాబు) నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు… ఆయన 12 సినిమాలకు దర్శకత్వం వహించి కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇక మరికొన్ని సినిమాల్లో నటించి నటుడిగా కూడా తన సత్తా ఏంటో చూపించాడు. అలాంటి చిట్టిబాబు ప్రతి రోజు టీవీల్లో వచ్చే డిబేట్ లో పాల్గొంటూ తెలుగు ప్రేక్షకులందరికి సుపరిచితుడయ్యాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన గత రెండు మూడు రోజుల నుంచి అనారోగ్యానికి గురయ్యాడు.
దాంతో అతన్ని హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా అతనికి అనుకోకుండా నిన్న రాత్రి గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్టుగా వైద్యులైతే స్పష్టం చేశారు. ఇక ఏది ఏమైనా కూడా చిట్టిబాబు కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు అనే ఊరిలో జన్మించి సినిమాల మీదున్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ తన సత్తా చాటడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…
ప్రముఖ నటిగా గుర్తింపు సంపాదించుకున్న సౌందర్యం ను సైతం తనే ఇండస్ట్రీకి పరిచయం చేశాడు… సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీనటులతో అతనికి చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. ఇండస్ట్రీ లో ఏదైన ఇష్యూ జరిగినప్పుడు ఆయన దానిమీద స్పందిస్తూ ఆ సంఘటన లో తప్పు ఎవరిది? ఎందుకని వాళ్ళు అలా బిహేవ్ చేశారు అనే విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా తెలియజేస్తుంటాడు.
అలాగే అందులోని నిజ నిజాలను బయటపెడుతూ ఉండేవాడు. ఇక ఇలాంటి క్రమంలోనే చిట్టిబాబు లేని లోటు ఎవ్వరు తీర్చలేనిది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్ గా ఉంటాడు. ప్రతి విషయం మీద స్పందిస్తూ తప్పు ఒప్పులను తెలియజేస్తూ ఉంటాడు. ఇక అతని మృతి పట్ల సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం సంతాపాన్ని తెలియజేస్తూ ఉండడం విశేషం… ఇక ఆయన సినిమా ఇండస్ట్రీకి స్వస్తి చెప్పిన తర్వాత 1998వ సంవత్సరంలో బిజెపి పార్టీలో చేరాడు…