Homeక్రీడలుక్రికెట్‌SRH Vs DC: కమిన్స్ లేకపోతేనేం .. అతని వారసుడొచ్చాడు.. సన్ రైజర్స్ కాలర్ ఎగరేయించాడు

SRH Vs DC: కమిన్స్ లేకపోతేనేం .. అతని వారసుడొచ్చాడు.. సన్ రైజర్స్ కాలర్ ఎగరేయించాడు

SRH Vs DC: ఉప్పల్ మైదానం.. హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా ఆడింది. హైదరాబాద్ ప్లేయర్లలో ముఖ్యంగా అభిషేక్ శర్మ అదరగొట్టాడు. ఢిల్లీ జట్టు బౌలర్లలో ఏ ఒక్కరు కూడా గొప్పగా బౌలింగ్ చేయలేదు. అక్షర్ పటేల్ నుంచి మొదలు పెడితే కులదీప్ యాదవ్ వరకు అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు. వికెట్లు తీయడం అటు ఉంచితే.. కనీసం పరుగులను కట్టడి చేయడంలో విఫలమయ్యారు.

ప్లాట్ మైదానం మీద ఢిల్లీ బౌలర్లు విఫలమైతే..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్ ఒకరు సత్తా చూపించాడు.. కమిన్స్ లేని లోటును తీర్చాడు. నాలుగు ఓవర్లు వేసిన అతడు.. 32 పరుగులు ఇచ్చి.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ జట్టు పతనాన్ని అతడు శాసించాడు. సూపర్ బౌలింగ్ తో ఎక్స్ట్రార్డీనరీ ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా మిల్లర్ వికెట్ పడగొట్టిన తీరు ఈ మ్యాచ్ మొత్తానికి హైలైట్. ఢిల్లీ జట్టు బ్యాటర్లను ఈ స్థాయిలో ఇబ్బంది పెట్టిన ఆ బౌలర్ పేరు ఇషాన్ మలింగ. అద్భుతమైన బంతులు వేస్తూ.. ఢిల్లీ బ్యాటర్లను ఇబ్బంది పట్టిన అతడు.. భవిష్యత్తు ఆశా కిరణంగా కనిపిస్తున్నాడు.

రెండు జట్ల బ్యాటర్లు ఓవర్ కు పదిపరుగుల చొప్పున చేసినప్పటికీ.. బౌలర్లు సత్తా చూపించలేక ఇబ్బంది పడినప్పటికీ.. మలింగ మాత్రం అదరగొట్టాడు. ఢిల్లీ జట్టులో నితీష్ రానా (57), మిల్లర్(0), స్టబ్స్(27), ఆశుతోష్ శర్మ(14) వికెట్లను మలింగ సొంతం చేసుకున్నాడు. ఈ నలుగురు ఔట్ కావడంతో ఢిల్లీ జట్టు ఏ దశలో కోలుకోలేక పోయింది. షార్ట్ పిచ్ డెలివరీలు, బ్యాకప్ లెంత్ బంతులు వేసి ఢిల్లీ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఒక దశలో నితీష్ రాణా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న వేళ.. మలింగ రంగంలోకి వచ్చాడు. అతడిని బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత మిగతా వికెట్లను కూడా వేగంగా తీశాడు. జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలో వికెట్ తీసి మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం హైదరాబాద్ జట్టుకు అనుకూలంగా మార్చాడు.

వాస్తవానికి ఈ మైదానం మీద 243 పరుగుల లక్ష్యాన్ని చేదించడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే బ్యాటర్లకు పూర్తిగా సహకరిస్తోంది. కానీ, ఢిల్లీ బ్యాటర్లకు మలింగ అంత సీన్ ఇవ్వలేదు. కట్టుదిట్టమైన బంతులు వేసి తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా పుల్లర్ లెంగ్త్ బాల్స్ వేసి చుక్కలు చూపించాడు. అందువల్లే ఢిల్లీ జట్టు ఏ దశలోనూ విజయానికి దగ్గరగా రాలేకపోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version