Trivikram Srinivas : మాటల మాంత్రికుడిగా గుర్తింపును సంపాదించుకున్న త్రివిక్రమ్ కెరియర్ మొదట్లో టాప్ రైటర్ గా పేరుతెచ్చుకున్నారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి టాప్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇక ఇలాంటి క్రమంలోనే ఒంగోలులో 11వ రాష్ట్ర ప్రసూతి వైద్యుల వార్షిక సదస్సును నిర్వహించారు. ఈ ఈవెంట్ కి రాష్ట్రంలోని ప్రజలే కాకుండా కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా హాజరయ్యారు. మొత్తానికైతే 2000 మందికి పైగా ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం విశేషం… త్రివిక్రమ్ ఈ ఈవెంట్లో మాట్లాడుతూ యుద్ధాలన్నీ కుల,మత, ప్రాంతాల కోసం జరగవని వ్యాపారం కోసమే జరుగుతాయని మాట్లాడాడు…
ఇక డబ్బుకు ఎంతవరకు ప్రాముఖ్యతను ఇవ్వాలి అని ఒకరు త్రివిక్రమ్ ను అడగగా…అది మనం చూసే లెన్స్ ను బట్టి ఉంటుందని, కానీ ఖచ్చితంగా డబ్బుకి మాత్రం విలువ ఇవ్వాలని చెప్పాడు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉందని చెప్పాడు. అప్పు లేని మనిషి ఉండనట్టే తప్పులు లేని వారు ఉండరని ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుందని చిన్న చిన్న తప్పులు ఉన్నప్పుడే అది జీవితానికి అందం అని ఆయన చెప్పడం విశేషం…
సినిమాల్లో వైద్యులను నెగెటివ్ గా చూపిస్తారు ఎందుకని అడగగా దానికి త్రివిక్రమ్ నవ్వుతూ వైద్యుల కంటూ ఒక యూనియన్ లేదు. కాబట్టి వాళ్లను అలా చూపించిన కూడా అడిగేవారు ఎవరు ఉండరు అనే ఒక ధైర్యంతో అలా చూపిస్తున్నాం అంటూ నవ్వుతూ ఫన్నీగా సమాధానం చెప్పాడు…
ప్రపంచంలో అతి కష్టమైన నిత్యం లేబర్ రూమ్ (కాన్పుల గది) కష్టాలను చూస్తున్న గొప్పవారు మీరు మిమ్మల్ని మించిన వారు ఈ ప్రపంచంలో ఎవరున్నారు అంటూ గైనకాలజిస్ట్ ల మీద త్రివిక్రమ్ చేసిన వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి… ఈ విషయం పక్కన పెడితే త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో ‘గాడ్ ఆఫ్ వార్’ అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు…
