Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: పవన్ కళ్యాణ్ తో ఆటలు వద్దు అంటూ యాంకర్ అనసూయ షాకింగ్ కామెంట్స్.....

Anasuya Bharadwaj: పవన్ కళ్యాణ్ తో ఆటలు వద్దు అంటూ యాంకర్ అనసూయ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్..

Anasuya Bharadwaj: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చుట్టూ రాజకీయాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎదో ఒక విషయం లో ప్రత్యర్థులు ఆయన్ని అవసరానికి మించి టార్గెట్ చేస్తున్నారని ఈమధ్య కాలంలో అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ని కులం పరంగా, మతం పరంగా కూడా వాడుకొని విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్లను మనం ప్రతీ రోజు చూస్తూనే ఉన్నాం. జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పై ద్వేషంతో ఏ రేంజ్ లో నోరు పారేసుకునేవారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన కేవలం పవన్ కళ్యాణ్ ని మాత్రమే కాదు , హిందూ దేవుళ్లను తిడుతూ అనేక వీడియోలు తయారు చేశారు. అంతే కాకుండా హిద్మా లాంటి నక్సలైట్ లను , టెర్రరిస్టులను కూడా సపోర్టు చేస్తూ ఆయన గతం లో వీడియోలు చేశారు. అందువల్లే ఆయన పై UAPA చట్టం క్రింద కేసు నమోదైంది.

ప్రస్తుతం నెల్లూరు జైల్లో లో రిమాండ్ ఖైదీ గా ఉన్నారు రావణ్. మొదట్లో ఇతనికి కొంతమంది సపోర్ట్ చేశారు కానీ , ఇతని గురించి రిమాండ్ విచారణలో బయటకు వస్తున్న నిజాలను చూసి ఇతనికా మనం సపోర్టు చేసిందని అనేక మంది సిగ్గు పడుతున్నారు. ఇతని తరుపున మొదటి నుండి కోర్టులో కేసులు వాదిస్తూ వచ్చిన జడ శ్రవణ్ కూడా తప్పుకున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నారు. అయితే ఈ అంశాలపై రీసెంట్ గా ఒక ఈవెంట్ లో పాల్గొన్న యాంకర్ అనసూయ ని స్పందించాల్సిందిగా మీడియా రిపోర్టర్స్ కోరారు. అందుకు ఆమె ఇచ్చిన సమాదానాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియో ని పవన్ అభిమానులు ఒక రేంజ్ లో షేర్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె మాట్లాడుతూ ‘ఇప్పుడు అనవసరంగా కాంట్రవర్సీ ప్రశ్నలు ఎందుకు చెప్పండి. ఆయన తపన పడేదే మనకోసం. మనమే ఇష్టపడి , ఎంతో ఆశతో ఒక నాయకుడిని ఎన్నుకుంటాము. చాలా మంది ఆ తాపత్రయం లో , ఎన్నో ఒడిదుడుగులను దాటుకొని ప్రజా సేవ చేస్తుంటారు. నేను ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం చెప్పాను , పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉండరు , భక్తులు ఉంటారు అని. మొదటిసారి ఎవరు ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ అవ్వదు, మన నుండే ఆయన వచ్చారు , ఆయనకు తోడుగా ఉంటూ , ఆయన చేసే మంచి పనులను సపోర్టు చెయ్యాలి’ అంటూ చెప్పుకొచ్చారు అనసూయ..ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అంశంపై నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు అంటూ చెప్పకనే చెప్పింది యాంకర్ అనసూయ.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version