Lenin Movie : అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో క్రియేట్ చేసిన మూడు సన్నివేశాలను తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయిన మూడు సినిమాల నుంచి కాపీ చేశారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఆ మూడు సన్నివేశాలు ఏంటి ఏ సినిమా నుంచి కాపీ చేశారు అంటే ఈ మూవీలో హిట్ ఫ్రెండే విలన్ కావడం అనేది ‘రంగం’ సినిమా నుంచి కాపీ చేశారు. ఇక అలాగే హీరో ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని హీరో పెళ్లి చేసుకోవడం ‘ఆర్య 2’ సినిమా నుంచి తీసుకున్నారు. ఇక ఫ్రీ క్లైమ్యాక్స్ లో హీరో హీరోయిన్ ను చంపడం అనేది బాలయ్య బాబు హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కృష్ణ బాబు సినిమా నుంచి కాపీ చేశారు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తో ముందుకు సాగుతుంది. కాబట్టి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఈ మూవీని ఇప్పటికే ప్రేక్షకులందరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అఖిల్ సైతం ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరింత ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్న సక్సెస్ ఇన్ని రోజులకు వరించడంతో అఖిల్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా పండగ చేసుకుంటున్నారు. వాళ్ల అభిమానులు సైతం ఆనంద పడుతున్నారు…
ఇక ఏది ఏమైనా కూడా అఖిల్ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి సినిమాలు చేస్తే అతనికి ఈజీగా సక్సెసులు దక్కుతాయని మరి కొంతమంది కామెంట్లు చేస్తుండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…
