Heart Health: గుండె.. ఇది శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. శరీర భాగాలన్నీ కీలక పాత్రలు పోషిస్తాయి కానీ గుండెలేకపోతే బతకగలమా? బ్రెయిన్ లేకపోయినా బతకలేము అనుకోండి. అయితే ఇక్కడ ఏ పార్ట్ గొప్పదని మన టాపిక్ కాదండోయ్.. గుండెకు సంబంధించిన ఆరోగ్యం గురించి.. ఇంతకీ మీ గుండె ఆరోగ్యంగానే ఉందా? ఇప్పుడు ఉన్నా ఫ్యూచర్ లో ఉంటుంది అంటారా? ఈ సందేహాలు ఎందుకు ఓ సారి చదివేస్తే పోలా..
శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా.. గుండె పదికాలాల పాటు చల్లగా ఉండాలన్నా.. మంచి నిద్ర అవసరం. సరిగ్గా నిద్ర పోకపోతే చాలా సమస్యలు వస్తాయట. స్కూల్లో పాఠాలు చెబుతూ టీచర్, సిగిరెట్ తాగుతూ ఓ ప్రైవేట్ ఎంప్లాయ్, కుర్చీలో కూర్చొని ఓ ప్రభుత్వ ఉద్యోగి, వంట చేస్తూ ఓ మహిళ, పొలంలో రైతు, ఇలా చెప్పుకుంటూ పోతే గుండె సమస్యలకు అతీతులు కాని వారు ఎవరండి.. అందుకే మీ గుండెను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే.. మీ పిడికిలి అంత మీ గుండె పదిలంగా ఉండాలంటే కంటి నిండా నిద్ర అవసరం.
హృదయాన్ని కాపాడుకోవాలంటే ఉదయం అయినా లేవకుండా పడుకోవడం కాదు. సరైన నిద్ర పోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సుఖ నిద్ర, ఒత్తిడిని వదిలేస్తే హార్ట్ కూడా అలసట లేకుండా ఉంటుంది. అయితే నిద్ర లేకపోతే ఆరోగ్య వ్యవస్థ బలహీనపడడం, ఆస్తమా, జీర్ణవ్యవస్థ సమస్యలు తలెత్తడం వంటి పరిస్థితుతుల ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి కేవలం నిద్ర పోవడం వల్ల ఎంతటి లాభం ఉందో తెలుసుకున్నారు కదా.. ఇంకే హాయిగా నిద్ర పోండి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు రోబోలా పనిచేసి.. రాత్రి మంచం మీదికి చేరగానే.. ఎక్కడ లేని టెన్షన్ లు, ఇతరులు ఏమనుకుంటున్నారో అనే మనోవేదనలు, ఫ్యూచర్ గురించి గుబులు అంటూ అన్ని కూడా గుర్తుకు వస్తాయి. వీటన్నింటిని తప్పించుకొని ఎలా నిద్ర పోవాలి అనుకుంటున్నారా? హాయిగా మీకు నచ్చిన కూల్ మ్యూజిక్ వింటూ ఏవైనా స్వీట్ మెమోరీస్ గుర్తు చేసుకుంటూ కల్లు మూసుకోండి. మంచి నిద్ర మీ సొంతం అవుతుంది. మొదట కాస్త కష్టమే కావచ్చు. కానీ అలవాటు అయితే ఏ టెన్షన్ కూడా గుర్తు రాదండోయ్.. మరి ఈ రోజు ట్రై చేసేయండి..