Ramoji Rao: వైసిపి సర్కారుపై విషపు రాతలతో రామోజీరావు రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను గద్దె దించాలి.. చంద్రబాబును అధికారంలోకి తేవాలన్న ఆలోచనతో బరితెగింపు రాతలు రాయిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరువు ఛాయలపై జగన్ పట్టించుకోవడం లేదని..కుంభకర్ణుడు మాదిరిగా నిద్రపోతున్నారంటూ ఈనాడులో రాసిన కథనం జుగుప్సాకరంగా ఉంది. ఇటీవలే రాష్ట్రంలో కరువు పరిస్థితులపై జగన్ సమీక్షించారు. కరువు సాయం ఒక నిరంతర ప్రక్రియ గా కొనసాగాలని ఆకాంక్షించారు. కరువు వచ్చిన మరుక్షణం పరిశీలించి.. ఆరు నెలల్లో సాయం అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిని గమనించని రామోజీరావు మాత్రం చంద్రబాబు మైకంలో పడిపోయి నిత్యం విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు.
కర్ణాటకలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటాయి. నీరు అందని వస్తువుగా మారింది. సామాన్యుల సైతం సోషల్ మీడియా వేదికగా ఈ సమస్యను తెరపైకి తెస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కానీ అక్కడ మీడియా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ ఏపీలో లేని సమస్యలను మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎత్తిచూపుతుండడం విశేషం. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ సర్కార్ ఒకే సీజన్లో ఏకంగా నాలుగు సార్లు సబ్సిడీ విత్తనాలు అందించింది. సీజన్ ముగియకుండానే కరువు మండలాలను ప్రకటించింది. పెట్టుబడి సాయాన్ని సైతం పెంచింది. అటు విపత్తుల సాయాన్ని సైతం ఎప్పటికప్పుడు అంచనా వేసి అందించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈనాడు కాకి లెక్కలతో బురద రాతలు రాస్తూ విష ప్రచారం చేస్తోంది.
గత ఏడాది వర్షాభావ పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిళ్ళింది. అయినా సరే నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాల రాయితీ వంటి వాటితో రైతులకు అన్ని విధాల స్వాంతన చేకూర్చడానికి జగన్ సర్కార్ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. సీజన్ ముగియకముందే 2023 ఖరీఫ్ నకు సంబంధించి 103 కరువు మండలాలను ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత తుది నివేదికల ఆధారంగా 14.07 లక్షల ఎకరాల్లో 33 శాతం కంటే ఎక్కువ శాతం పంట నష్టపోయినట్లుగా గుర్తించారు. 6.96 లక్షల మంది రైతులకు దాదాపు 900 కోట్ల పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అంచనా వేశారు. అలాగే కరువుతో పాటు తుఫాను సాయాన్ని త్వరలో రైతులు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం కంటే మిన్నగా పెట్టుబడి సాయాన్ని అందించడానికి నిర్ణయించింది. ఇవన్నీ చేస్తున్న జగన్ సర్కార్ పై ఈనాడు రోత రాతలు కొనసాగుతున్నాయి. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.