https://oktelugu.com/

E-shram Card: ఈ-శ్రమ్ కార్డ్ ఉన్నవాళ్లకు శుభవార్త.. రూ.2 లక్షల బెనిఫిట్?

E-shram Card:  కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ప్రయోజనం చేకూరేలా ఈ-శ్రమ పోర్టల్‌ను గతేడాది ఆగష్టు నెలలో మొదలుపెట్టింది. ఈ పోర్టల్ సహాయంతో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వాళ్లకు అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత పొందే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఈ శ్రమ్ కార్డ్ సహాయంతో ప్రభుత్వ స్కీమ్స్ నుంచి సులువుగా ఉపాధి పొందడం సాధ్యమవుతుంది. కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 18, 2021 12:16 pm
    Follow us on

    E-shram Card:  కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ప్రయోజనం చేకూరేలా ఈ-శ్రమ పోర్టల్‌ను గతేడాది ఆగష్టు నెలలో మొదలుపెట్టింది. ఈ పోర్టల్ సహాయంతో కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వాళ్లకు అన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత పొందే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. ఈ శ్రమ్ కార్డ్ సహాయంతో ప్రభుత్వ స్కీమ్స్ నుంచి సులువుగా ఉపాధి పొందడం సాధ్యమవుతుంది.

    E-shram Card

    E-shram Card

    కార్మికులకు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక కార్డు ఈ శ్రమ్ కార్డు కాగా ఈ కార్డును చూపించడం లేదా సమర్పించడం ద్వారా కార్మికులు తమ ప్రయోజనాలను పెద్దగా పొందాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ కార్డు వల్ల దేశంలో కూలీలు ఎక్కడైనా ఉపాధిని పొందవచ్చు. ఈ పోర్టల్ లో నమోదైన కార్మికులకు 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కవరేజీని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    Also Read: రూ.4,500తో నెలకు 51,000 రూపాయలు పొందే అవకాశం.. ఎలా అంటే?

    కార్మికుడికి పాక్షికంగా అంగవైకల్యం కలిగితే ఈ స్కీమ్ కింద లక్ష రూపాయల బెనిఫిట్ ను పొందవచ్చు. ఈ కార్డు సహాయంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాల ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. https://eshram.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఉచితంగానే నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    కార్మికులు పేరు, వృత్తి, చిరునామా, విద్యార్హత, నైపుణ్యం ఇతర వివరాలను పోర్టల్ లో రిజిస్టేషన్ కోసం అందించాల్సి ఉంటుంది. కార్మికుడు ఈ-శ్రమ్ పోర్టల్‌ ద్వారా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    Also Read: ఈ తప్పులు చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం.. పేదరికంలో మగ్గిపోవాల్సిందే?