Laxmi Devi: లక్ష్మీదేవి సంపదకు అధిపతి అనే సంగతి తెలిసిందే. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావు. అయితే అలా కాకుండా లక్ష్మీదేవికి కోపం వస్తే మాత్రం ఆ వ్యక్తి పేదరికం వల్ల ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంది. తెలియక చేసే చిన్నచిన్న తప్పులు పేదరికం, ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణమవుతాయి. రోజూ ఉదయం సమయంలో ఆలస్యంగా నిద్ర లేవకూడదు.
చీపురు లక్ష్మీదేవి(Laxmi Devi) కి ప్రతీక అనే సంగతి తెలిసిందే. చీపురును కనిపించని ప్రదేశంలో ఉంచితే మంచిది. లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడటంతో పాటు అలాంటి చోట నివాసం ఉండటానికి ఇష్టపడుతుంది. ఇంట్లో బూట్లు, చెప్పులు, ఇతర ఉపకరణాలు చెల్లాచెదురుగా ఉంటే ఆ అలవాటును మార్చుకోవాలి. ఇంట్లో చెడిపోయిన గడియారాలు ఉంటే దాన్ని తీసివేయాలి. చెడిపోయిన గడియారాలు ఇంట్లో ప్రతికూలతను సృష్టిస్తాయి.
Also Read: రూ.4,500తో నెలకు 51,000 రూపాయలు పొందే అవకాశం.. ఎలా అంటే?
ఇంట్లో శ్రీ యంత్రం ఉన్నవాళ్లు దానిని క్రమం తప్పకుండా పూజించాలి. పేద యువతులకు వీలైన ప్రతిసారి సహాయం చేయాలి. పేద యువతుల వివాహం, చదువుకు తమ వంతు సహాయం చేస్తే మాతా లక్ష్మి సంతోషించే ఛాన్స్ ఉంటుంది. కర్పూరం, లవంగాలతో హారతి ఇవ్వడం ద్వారా ఇంటి ప్రతికూలతలను సులభంగా తొలగించుకునే అవకాశం అయితే ఉంటుంది.
వారానికి ఒకసారైనా ఇంటిని ఉప్పుతో తుడవడం ద్వారా ఇంట్లో నెగిటివిటీ, వ్యాధులు తగ్గుతాయి. పేదవారికి ఆహారం అందించడం ద్వారా లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. ఆవుకు బెల్లం తినిపించడం, శుక్రవారం రోజున అమ్మవారి ముందు కాల్చిన గులాబీలను సమర్పించడం చేస్తే మంచిది.
Also Read: పీపీఎఫ్ లో చేరితే పొందే లాభాలు ఇవే.. తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే?