Bheemla Nayak: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, రానా హీరోలుగా మల్టీస్టార్‌గా తెరకెక్కుతోన్న సినిమా భీమ్లానాయక్. ఇందులో వీరిద్దరు పోటాపోటీగా కనిపించనున్నారు. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. కాగా, తెలుగులో సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండటం విశేషం. సితార ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు.
Bheemla Nayak
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) December 17, 2021
Also Read: ఆ ముగ్గురు స్టార్స్ కి గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిన 2021
తాజా సమాచారం ప్రకారం నేటితో ఈ సినిమా చివరి షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ క్రమంలోనే చివరి షెడ్యూల్ షూటింగ్‌ను వికారాబాద్ అడవుల్లో ప్రారంభమైంది. ఈ షూటింగ్లో రానా, పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే, ఈ షూటింగ్ మధ్యలో రోడ్‌పై భీమ్లానాయక్( Bheemla Nayak) బైక్‌రైడ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఖాకీ యూనిఫామ్‌లో పవన్ బుల్లెట్ నడుపుతున్న వీడియోను పవర్‌స్టార్ అభిమానులు తెగ వైరల్చేస్తున్నారు.
ఈ షెడ్యూల్‌తోనే సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ఆనంతరం క్రిస్మస్ వేడుకలకు భార్యతో కలిసి పవన్ రష్యాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అనంతరం తిరిగి వచ్చిన వెంటనే జనవరి తొలి వారంలో ప్రమోషన్లు ప్రారంభించనున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్లు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్ కోసంఅందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలకానున్న సంగతి తెలిసిందే.
Also Read: అభిమానమంటే ఇంతలా ఉంటుందా.. పెళ్లి పత్రికలో పవన్ కల్యాణ్ ఫొటో ప్రత్యక్షం