Good habits : జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు.. కానీ కొన్ని పొరపాట్లు ద్వారా అనుకున్న గమ్యానికి చేరలేక పోతుంటారు. అలా చేరాలంటే ప్రత్యేకంగా కొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. లేదా కొన్ని అలవాటులను చేర్చుకోవాలి. చాలామందికి తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు ఉంటాయి. అయితే ఇవి మంచివి లేదా జీవితానికి సంబంధించినవి అయితే సక్సెస్ అవుతారు. లేకుంటే అనుకున్న పనిని ఎప్పటికీ సాధించలేరు. కొంతమంది మానసిక నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. ఈ 8 అలవాట్లకు బానిస అయితే అనుకున్నది సాధించగలుగుతారు. మరి ఆ అలవాట్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
ఉదయం లేవడం:
కొంతమంది ఉదయం లేవడానికి చాలా ఇబ్బంది పడతారు. కానీ మిగతా వారి కంటే ముందే లేవాలని తపన ఉండాలి. అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం వల్ల మనసు యాక్టివ్ గా ఉంటుంది. శరీరం కూడా ఆరోగ్యంగా మారుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అందువల్ల ఉదయమే లేచి అలవాటును చేసుకోవాలి.
వ్యాయామం:
ప్రతిరోజు కచ్చితంగా వ్యాయామం చేసి అలవాటు చేసుకోవాలి. అది ఎక్ససైజ్ కావచ్చు లేదా వాకింగ్ కావచ్చు.. ఏదైనా సరే గంటపాటు శరీరం వర్క్ అవుట్ ను చేయడం వల్ల ఫిట్ గా మారుతుంది. దీంతో రోజంతా ఏ పని చేయడానికి అయినా ఉత్సాహం ఉంటుంది. అంతేకాకుండా నీరసం ఉండకుండా యాక్టివ్ గా ఉండగలుగుతారు.
సరైన నిద్ర:
నేటి కాలంలో చాలామంది వివిధ కారణాలతో ఆరోగ్యకరమైన నిద్రపోవడం లేదు. శరీరానికి నిద్ర సక్రమంగా లేకపోతే అలసటగా మారుతుంది. ఫలితంగా అనేక రోగాలు వస్తాయి. అందువల్ల ప్రతిరోజు ఎనిమిది గంటల పాటు ఆరోగ్యకరమైన నిద్రపోయే ప్రయత్నం చేయాలి. అయితే మంచి నిద్ర రావాలంటే మొబైల్, ఇతర వ్యాపకాలను దూరంగా ఉంచుకోవాలి. అప్పుడే అనుకున్న నిద్ర వస్తుంది. నిద్ర మంచిగా ఉండడంవల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది.
నిత్యం నేర్చుకోవడం:
ప్రతిరోజు.. ప్రతి సమయం ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలా సాధన చేయడం వల్ల మిగతా వారి కంటే ముందుగా సక్సెస్ఫుల్ జీవితాన్ని అనుభవిస్తారు. ఇలాంటి కోర్సులు నేర్చుకునే అవకాశం లేకపోతే కనీసం కొత్త పుస్తకం చదవాలి. లేదా ఆన్లైన్లో కొత్త కోర్సులు వేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు.
Also Read: ‘తమ్ముడు’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..కనీసం ప్రమోషన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేదు!
రేర్ స్కిల్స్:
కొత్త విషయాలను నేర్చుకోవడం వరకు ఓకే. అయితే మిగతావారు ఒక విషయంపై సాధన చేస్తే దాని గురించి ఆలోచించకుండా మిగతా విషయాలపై పరిశోధనలు చేయాలి. ఇలా చేయడంవల్ల మీ దారికి ఆటంకం లేకుండా సాగుతుంది. అంతేకాకుండా మిగతా వారి కంటే ముందుగా గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది.
పాజిటివ్ థింకింగ్:
కొంతమంది ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు మాట్లాడుతూ ఉంటారు. అందుకు వారి ఆలోచనలు బాగా లేకపోవడమే. అంతేకాకుండా నెగటివ్ థింకింగ్ వల్ల ఎప్పుడు ముందుకు సాగలేరు. ఏ చిన్న అడ్డంకులు వచ్చిన వాటిని పట్టించుకోకుండా పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్లాలి. ఒక పనిని ప్రారంభించి దానిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. అప్పుడే సరైన సమయంలో దానిని పూర్తి చేయగలరు
బెస్ట్ సర్కిల్:
చుట్టుపక్కల స్నేహితులు లేదా బంధువులు సక్సెస్ఫుల్ అయిన వారు ఉంటే చాలా మంచిది. ఎందుకంటే వారి ఆలోచనలే మీకు వస్తాయి. వారి బాటలోనే మీరు వెళ్తారు. అలా కాకుండా చుట్టుపక్కల నిర్లక్ష్యంగా ఉండే వారితో ఉండడం వల్ల నష్టపోతారు. అందువల్ల మీ చుట్టుపక్కల ఉండే సర్కిల్లో బెటర్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయాలి.
డైలీ టేబుల్:
ప్రతిరోజు ఏమేం పని చేయాలో ఒక టేబుల్ను ఏర్పాటు చేసుకొని.. అందులో రాసుకోవాలి. ఈ టేబుల్ ప్రకారంగా పనులు పూర్తి చేయడం వల్ల మనసులో కాన్ఫిడెంట్ పెరుగుతుంది. దీంతో అనుకున్న పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు.