AP Mega DSC 2025 Latest Update: ఏపీలో ( Andhra Pradesh) ఉపాధ్యాయ నియామకాలపై దృష్టి పెట్టింది కూటమి సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నాటికి ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే డీఎస్సీ పరీక్షల నిర్వహణ పూర్తయింది. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసింది ప్రభుత్వం. తుది కీ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. వెంటనే ఫలితాలు వెల్లడించి కొత్త నియామకాలు చేపట్టాలని చూస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 16 వేలకు పైగా ఉపాధ్యాయ నియామక పోస్టులకు ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మే 15 వరకు దరఖాస్తులను స్వీకరించింది. అటు తరువాత పరీక్షల నిర్వహణకు సిద్ధమయింది. ఇప్పుడు పరీక్షలు పూర్తి కావడంతో ఫలితాలు వెల్లడించి నియామకాలు చేపట్టాలని భావిస్తోంది.
హామీ ఇచ్చినట్టుగానే..
అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ( Mega DSC) ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా డీఎస్సీ ఫైల్ పై సంతకం చేశారు. ఏకంగా 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అన్ని రకాల అడ్డంకులు దాటుకుని పరీక్షల నిర్వహణ పూర్తి చేయగలిగారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. డీఎస్సీ కి సంబంధించి ప్రాథమిక కీ విడుదల సందర్భంగా మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. డీఎస్సీ నిర్వహణలో కృషి చేసిన విద్యాశాఖ అధికారులను అభినందించారు.
Also Read: టిడిపి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. మధ్యలో మాజీ మంత్రి.. ఆ జిల్లాలో బిగ్ ఫైట్!
కోర్టు కేసులతో..
అయితే డీఎస్సీ కి సంబంధించి చాలా రకాల కోర్టు కేసులు( Court cases) ఎదురయ్యాయి. 31 కోర్టు కేసులు ఎదురుకాగా.. వాటన్నింటినీ అధిగమిస్తూ నోటిఫికేషన్ విడుదల అయింది. పరీక్షల నిర్వహణ పూర్తయింది. ఇదే విషయంపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ మెగా డీఎస్సీ ని అడ్డుకునేందుకు వైసిపి కుట్రలు చేసిందని ఆరోపించారు. కోర్టు కేసుల రూపంలో నిలిపివేయాలని ప్రయత్నించిందని.. వాటన్నింటినీ అధిగమించి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించినట్లు నారా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టులోగా డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని లోకేష్ ప్రకటించారు.
Also Read: అందర్నీ స్మరించి.. ఒక్కరిని మరిచిన చంద్రబాబు.. కారణమేంటి?
విశేష స్పందన..
16 వేలకు పైగా నోటిఫికేషన్ (notification)వచ్చిన డీఎస్సీకి అభ్యర్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. మొత్తం 3.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఐదు పాయింట్ 77 లక్షల దరఖాస్తులు రాగా.. 92.9 శాతం మంది పరీక్షలకు హాజరైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వైసిపి హయాంలో 6 వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ జారీ అయింది. కానీ ఇంతలో ఎన్నికలు సమీపించడంతో అవి రద్దయ్యాయి. వాటికి మరో 10 వేల పోస్టులు జతచేస్తూ 16 వేల పోస్టులతో డీఎస్సీ నియామక ప్రక్రియను చేపట్టింది కూటమి సర్కార్. మరో నెల రోజుల్లో పూర్తి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది.