Thammudu First Day Collection: వరుస ఫ్లాప్స్ లో ఉన్న హీరో నితిన్(Actor Nithin), ఈసారి ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో చేసిన చిత్రం ‘తమ్ముడు'(Thammudu Movie). విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. పాటలు పెద్దగా హిట్ అవ్వలేదు కానీ, సినిమాలో మాత్రం ఎదో విషయం ఉంది, డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) కాబట్టి మినిమం గ్యారంటీ కంటెంట్ పెట్టి ఉంటాడని అంతా అనుకున్నారు. అలాంటి అంచనాలతో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ టాక్ ప్రభావం సినిమా పై చాలా గట్టిగా పడింది. కానీ నితిన్ కి ఒక సెక్షన్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండడంతో టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు ఈ చిత్రానికి బుక్ మై షో(Book My Show) యాప్ లో 30 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి.
Also Read: ఒక్క ఓవర్ లో 23 పరుగులా? ప్రసిద్ద్ కృష్ణను ఎంపిక చేసిన వారికి దండం పెట్టాలి!
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. షేర్ వసూళ్లు కేవలం కోటి 60 లక్షల రూపాయిలు మాత్రమే. రాబిన్ హుడ్ చిత్రానికి కూడా మొదటి రోజు దాదాపుగా మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే దాంట్లో సగం ఓపెనింగ్ కూడా ‘తమ్ముడు’ చిత్రానికి రాలేదు అన్నమాట. నితిన్ పరిస్థితి సినిమా సినిమాకి ఇలాగే మారుతూ వస్తుంది. ఇక ఓవర్సీస్, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల కలెక్షన్స్ గురించి సరేసరి. కనీసం కోటి రూపాయిల గ్రాస్ కూడా ఆ ప్రాంతాలకు కలిపి రాలేదు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ మొత్తానికి కలిపి నాలుగు కోట్ల రూపాయిల షేర్ అయినా వస్తుందో లేదో అని బయ్యర్స్ భయపడిపోతున్నారు.
ఎంత వసూళ్లు వచ్చినా ఈ వీకెండ్ లోనే రావాలి, సోమవారం నుండి సినిమా బిజినెస్ క్లోజ్ అయిపోయినట్టే. చూస్తుంటే దిల్ రాజు కి బిగ్ బడ్జెట్స్ గండం చాలా బలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ఏడాది ప్రారంభం లో ఆయన భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ తక్కువ బడ్జెట్ తో తీసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని నెలకొల్పింది. ఇప్పుడు ‘తమ్ముడు’ చిత్రానికి కూడా ఆయన దాదాపుగా 70 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేసాడు. నాన్ థియేట్రికల్ రైట్స్ నుండి 30 కోట్ల రూపాయలకు పైగా రీ కవర్ అయ్యాయి. థియేట్రికల్ పరంగా మాత్రం కనీసం 5 కూడా రికవర్ అయ్యేలా కంపించడం లేదు. కనీసం ప్రొమోషన్స్ కోసం చేసిన ఖర్చుని అయినా వెనక్కి రప్పిస్తుందో లేదో చూడాలి.