FIFA World Cup 2022- Brazil Team: పిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఖతార్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈసారి 32 జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఖతార్ ఏకంగా 7 మైదానాలు నిర్మించింది. ఒక మైదానాన్ని పునర్ నిర్మించింది. డిసెంబర్ 18న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈసారి సాకర్ కప్ ఫేవరెట్ గా బ్రెజిల్ బరిలోకి దిగుతోంది. స్టార్ ఆటగాడు నెయ్ మార్ పై గంపెడు ఆశలు పెట్టుకుంది.

ఇదీ బ్రెజిల్ చరిత్ర
ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో బ్రెజిల్ అత్యధిక సార్లు ఛాంపియన్ గా నిలిచింది. అంతర్జాతీయ ఫుట్బాల్ పై తనదైన ముద్ర వేసింది. నెంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతోంది. ఈసారి స్టార్ ఆటగాడు నెయ్ మార్ పై భారీ ఆశలు పెట్టుకుంది. మరోసారి కప్ అందుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గ్రూప్_ జీ లో ఉన్న బ్రెజిల్ మొదట సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్ తలపడనుంది. మరోవైపు ఫుట్బాల్ దిగ్గజాల్లో ఒకడిగా ఎదిగి ఆధునిక శకంలో ఆటకు ఆదరణ పెంచిన రొనాల్డో కప్పు కల సాకారం కోసం చివరి సాకర్ మహా సమరానికి సిద్ధమయ్యారు. అతడి జట్టు పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే దక్షిణ కొరియా జట్ల తో గ్రూప్_ హెచ్ ఆసక్తి రేపుతోంది.
గతం కోసం
బ్రెజిల్ చరిత్ర గత మెంతో ఘనం. మైదానంలో దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులను బెంబేలెత్తించేది. ఈసారి వైభవం సాధించాలి అనుకుంటున్నది. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఐదు ప్రపంచ కప్ లు గెలుచుకుంది.

ఈ సాంబా జట్టు ఆరో ప్రపంచ కప్ గెలుచు కునేందుకు 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్నది. ప్రపంచ నంబర్ వన్ గా సూపర్ ఫామ్ తో టోర్నీ లోకి అడుగుపెడుతున్న ఆ జట్టుకు అద్భుతం జరిగితే తప్ప గ్రూప్ లో అగ్రస్థానం లభించడం ఖాయం. నెయ్ మార్ పై భారీ అంచనాలు పెట్టుకుంది. మరో మూడు గోల్స్ చేస్తే అతడు(75) బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన పీలే(77) రికార్డు అధిగమిస్తాడు. కీలక టోర్నీల్లో నాకౌట్ మ్యాచ్లో తడబడే బలహీనతను అధిగమిస్తే ఈ టోర్నీలో ఆ జట్టుకు తిరుగులేదు.