Happy Holi 2022: హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో గత రెండేళ్లుగా కరోనా భయంతో పండుగ నిర్వహణపై నిషేధాలు ఉండటంతో ఈ సారి ఆంక్షలు లేకపోయినా నిబంధనలు మాత్రం విధించారు. ఈ నేపథ్యంలో పండుగ నిర్వహణపై అందరు ఉత్సాహంతో ఉన్నారు. ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేసుకున్నారు. వేడుకల నిర్వహణకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఘనంగా చేసుకుంటున్నారు.

ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు హోలీ పండుగను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నగరంలోని మార్కెట్లు కళకళలాడుతున్నాయి. అపార్ట్ మెంట్లలో సామూహికంగా వేడుకలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పూర్వం గోల్కొండ కోట వేదికగా ఉత్సవాలు జరిపేవారని చెబుతారు. సంప్రదాయాలకు విలువ ఇచ్చి హోలీ పండుగను జరుపుకోవడం విశేషం.

Also Read: భర్తల విషయంలో భార్యలు చేయకూడని ముఖ్యమైన పనులు ఇవే?
హోలీ వేడుకలో రంగులే ప్రధానం కావడంతో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. సహజసిద్ధమైన రంగులతో ఎలాంటి ప్రమాదాలు ఉండవని చెబుతున్నారు. రసాయనిక రసాయనాలతో చేటు ఉంటుందని సూచిస్తున్నారు. అందుకే కలర్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సేంద్రియ రంగులే ఎలాంటి హాని చేయవని హితవు చెబుతున్నారు. అందుకే రంగుల ఎంపికలో జాగ్రత్తలు వహించి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.
రసాయన రంగులు వాడితే కళ్లల్లో పడితే ప్రమాదమని తెలిసినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఫలితంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. పండుగ రెండురోజులు మద్యం దుకాణాలు బంద్ చేయడంతో ఇక ఇళ్లలోనే దాచుకున్న మందుతోనే ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బయట ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
Also Read: ధర్మ శాస్త్రం ప్రకారం పురుషుడు భార్యతో ఏ విధంగా నడుచుకోవాలో తెలుసా?