Chandrababu- Mamata Banerjee: దేశంలో పెగాసస్ వ్యవహారం సృష్టించిన వివాదం అందరికి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేస్తూ కుట్రలు చేస్తోందని అప్పట్లో పార్లమెంట్ ను ఓ కుదుపు కుదిపేసిన పెగాసస్ విషయం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ బాంబు పేల్చారు. అసెంబ్లీ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పెగాసస్ సాఫ్ట్ వేర్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో పెను దుమారం రేగేందుకు పరోక్షంగా కారణమవుతోంది.
మమతా బెనర్జీ వ్యాఖ్యలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. టీడీపీ పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయలేదని చెప్పారు. ఒకవేళ టీడీపీ ఆ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసి ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చేదా? అని ప్రశ్నించారు. దీదీ ఆరోపణల్లో వాస్తవం లేదని బుకాయించారు. ఏదో కావాలనే ఉద్దేశంతో టీడీపీపై బురదజల్లేందుకే ఇలా మాట్లాడుతున్నారని వాపోయారు. అనవసరంగా ఆరోపణలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయాలని అప్పట్లో మా దగ్గరకు వచ్చినా మేం వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేక తిరస్కరించినట్లు పేర్కొన్నారు.
Also Read: Akhilesh Yadav: అఖిలేష్ ఎన్నికల ఖర్చులను కేసీఆర్, జగన్ సర్జారట
మొత్తానికి దీదీ చేసిన వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మమతా బెనర్జీ ఎందుకు ఇలా వ్యవహరించారో కూడా అర్థం కావడం లేదు. నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ కొందరు బెంగాల్ పోలీసులను సంప్రదించారని గుర్తు చేశారు. ఆ సమయంలోనే చంద్రబాబు దీన్ని కొనుగోలు చేసినట్లు మమత వివరించడం గమనార్హం.
పెగాసస్ వ్యవహారంలో దీదీ రేపిన వివాదం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించిన విషయం తెలిసిందే. టీడీపీ సైతం వారి ఆరోపణల్ని ఖండించింది. తాము ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని చెప్పింది. దీంతో గొడవ అక్కడే ఆగిపోయినా ఇప్పుడు మమత పేల్చిన బాంబుతో మళ్లీ పెగాసస్ వ్యవహారం తెరమీదకు వచ్చింది. దీంతో పరిస్థితి ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు.
Also Read: TDP- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆఫర్ పై టీడీపీ మౌనం.. అసలు కారణం ఇదేనా?