https://oktelugu.com/

Rajamouli RRR Promotions: ప్రమోషన్స్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్న రాజమౌళి.. ఇవేం ఇంటర్వ్యూలు బాబోయ్..

Rajamouli RRR Promotions: రాజమౌళి అంటే మామూలోడు కాదు. సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎవరి ఊహకు అందని సర్ప్రైస్ ఎలిమెంట్స్ తో, బలమైన ఎమోషనల్ సీన్లను పండించగల దిట్ట. ఆయన టేకింగ్, మేకింగ్ ముందు ఎలాంటి స్టార్ హీరోలు కనిపించరు. కేవలం ఆ సినిమాలో పాత్రలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఎవరి ఊహలకు అందని కాన్సెప్ట్ లతో సినిమాలు తీసి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నాడు జక్కన్న. అయితే కేవలం సినిమాలు తీయడంలో మాత్రమే కాదు.. […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 18, 2022 / 11:33 AM IST
    Follow us on

    Rajamouli RRR Promotions: రాజమౌళి అంటే మామూలోడు కాదు. సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎవరి ఊహకు అందని సర్ప్రైస్ ఎలిమెంట్స్ తో, బలమైన ఎమోషనల్ సీన్లను పండించగల దిట్ట. ఆయన టేకింగ్, మేకింగ్ ముందు ఎలాంటి స్టార్ హీరోలు కనిపించరు. కేవలం ఆ సినిమాలో పాత్రలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఎవరి ఊహలకు అందని కాన్సెప్ట్ లతో సినిమాలు తీసి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నాడు జక్కన్న.

    Rajamouli RRR Promotions

    అయితే కేవలం సినిమాలు తీయడంలో మాత్రమే కాదు.. ఎంత పెద్ద సినిమాకు అయినా అనుకున్నంత హైప్ తీసుకురాగల కాన్సెప్ట్ లతో ప్రమోషన్స్ చేస్తుంటాడు. ఓ ప్రాంతంలో ఊసేలేని సినిమా గురించి అందరూ చర్చించుకునే స్థాయికి తీసుకురావడంలో జక్కన్న తర్వాతే ఎవరైనా. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో కూడా ఇలాగే ప్రమోట్ చేస్తున్నాడు రాజమౌళి.

    Rajamouli with NTR and Ramcharan

    Also Read: RRR : ఆర్ఆర్ఆర్ మూవీకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

    ఆరు రోజుల్లోనే 9 నగరాలు హీరోలను వెంటేసుకుని తిరుగుతున్న రాజమౌళి.. విభిన్నమైన ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలను పక్కన పెట్టుకొని ఇంటర్వ్యూలు చేయాలి అంటే మామూలు విషయం కాదు. వారి స్టార్ స్టేటస్ లను కూడా పక్కన పెట్టేసి వారిని చిన్నపిల్లల్లా మార్చేసి కామెడీ పండించేస్తున్నాడు మన జక్కన్న. మొన్న డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి చేసిన ఇంటర్వ్యూ ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే.

    ఇక నిన్న ముంబైలో రాజమౌళి ఇంట్లో అందరూ కలిసి ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి కామెడీ టైమింగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించేశారు. ఇలాంటి సరికొత్త ఇంటర్వ్యూలు ఇప్పటివరకు ఎవరూ చేయలేరేమో. ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ గురించే చర్చించుకుంటున్నారు అంటే ఈ క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుంది. ఇక రేపు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా కర్ణాటకలో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

    Also Read: AP Govt Key Decision On RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

    Tags