Trivikram Srinivas పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి ఇండస్ట్రీ లో అత్యంత ఆప్త మిత్రుడు ఎవరైనా ఉన్నారా అంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మాత్రమే. ఏ అమృతగడియల్లో వీళ్ళ స్నేహం మొదలైందో తెలియదు కానీ, స్నేహానికి పర్యాయపదం లాగా నిలిచారు వీళ్లిద్దరు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉండడం తో ఆయనకు సినిమాలను ఎంపిక చేసుకోవడం చాలా కష్టం అయ్యేది. అలాంటి సమయం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తరుపున కథలు విని ఫైనలైజ్ చేసేవాడు. వకీల్ సాబ్, హరి హర వీరమల్లు,ఓజీ వంటి చిత్రాలు త్రివిక్రమ్ సెట్ చేసినవే. స్పీడ్ మనీ కోసం రీమేక్ సినిమాలను పవన్ కళ్యాణ్ కి సజస్ట్ చేసింది ఆయనే, పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచే విధంగా పాన్ ఇండియన్ సినిమాలను ప్లాన్ చేసింది కూడా ఆయనే. అందుకే త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ అంత గౌరవం ఇస్తుంటాడు.
వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. ‘జల్సా’ , ‘అత్తారింటికి దారేది’ సినిమాలు కమర్షియల్ గా ఇండస్ట్రీ ని షేక్ చేశాయి. కానీ ‘అజ్ఞాతవాసి’ చిత్రం మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా ఫలితం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాట్లాడడం మానేసాడు. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చినప్పటికీ స్టేజిపై మాట్లాడలేదు, బ్రో ది అవతార్ చిత్రానికి స్క్రిప్ట్ ని అందించినప్పటికీ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదు. ఇలా పవన్ కళ్యాణ్ అభిమానుల ముందు ముఖం చాటేస్తూ తిరుగుతున్నాడు త్రివిక్రమ్. ఇప్పుడు ఆయన చాలా కాలం తర్వాత ఈ నెల 20 వ తేదీన వైజాగ్ లో జరగబోయే ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఒక అతిథిగా హాజరు కాబోతున్నాడు.
కనీసం ఈ ఈవెంట్ లో అయినా ఆయన పవన్ కళ్యాణ్ అభిమానుల ముందు నోరు విప్పుతాడా , లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి కూడా ఆయన సైలెంట్ గా ఉండిపోతాడా అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ ఇచ్చే స్పీచ్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నోటి నుండి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చూడాలని అభిమానులు చాలా కోరుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ కోరిక గత 8 నుండి నెరవేరడం లేదు. ఈసారి మాత్రం ఆయన ప్రసంగం ఇస్తే కచ్చితంగా ‘హరి హర వీరమల్లు’ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి పెరుగుతాయి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊపందుకుంటాయి, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.