EMI Trap: ప్రస్తుత కాలంలో ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తికి ఆదాయం కంటే ఈఎంఐ లో చెల్లించడం ఎక్కువగా ఉంటుంది. అవసరం ఉన్నదానికి.. అంటూ ఇబ్బడి ముబ్బడిగా బ్యాంకు రుణాలు తీసుకుంటూ ఉన్నారు. బ్యాంకు రుణం తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ దీనిని చెల్లించడం భారంగా మారింది. అయితే ఒక ప్రణాళిక బద్దకమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఈఎంఐ భారం ఉండదు. అలాగే నెల రాగానే డబ్బులు పోతాయి అని చింత ఉండదు. అందుకోసం ఏం చేయాలంటే?
Also Read: మనదేశంలో ఎన్ని కోట్ల మంది లోన్లు తీసుకుంటున్నారో తెలుసా?
కొత్త ఉద్యోగం రాగానే చాలామంది ఏదో ఒకటి కొనాలని అనిపిస్తుంది. ఎందుకంటే నెల నెల జీతం వస్తుంది.. దాని ద్వారా ఈఎంఐ చెల్లించాలని అనుకుంటారు. దీంతో చాలామంది బ్యాంకు రుణం ద్వారా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు ఇల్లు, కారు వంటి వస్తువులు కొనుగోలు చేయాలని చూస్తారు. అయితే ఇవి కొత్తగా ఉద్యోగంలో వచ్చినప్పటి కంటే చేతిలో కొంత డబ్బు వచ్చాక కొనుగోలు చేస్తే మంచిది. ఎందుకంటే వాటిని కొనుగోలు చేసినప్పుడు బాగానే ఉంటుంది.. అది ఈఎంఐ చెల్లించేటప్పుడు ఎలాంటి తృప్తి ఉండదు. కొందరు మొబైల్ కొనుగోలు చేయడానికి కూడా ఈఎంఐ ఏర్పాటు చేసుకుంటారు. ఇది ఎంత మాత్రం సేఫ్ కాదు.
చాలామంది ఏమైనా వస్తువులు వారికి అవసరం ఉన్నదానికంటే.. ఎదుటివారు కొనుగోలు చేశారనే బాబా ద్వేగంతోనే కొనుగోలు చేస్తారు. తమ ప్రెస్టేజ్ కోసమో.. లేదా ఎదుటివారి ముందు గొప్పతనంగా ఉండడానికి లోన్లు తీసుకొని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇలాంటి వాటి జోలికి పోకుండా ఒక వస్తువు ఎంత అవసరమో గుర్తించి దానిని మాత్రమే కొనుగోలు చేసేలా ప్రణాళిక వేసుకోవాలి.
ఒక ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే కొందరు దానిపై 90% రుణం తీసుకోవాలని అనుకుంటున్నారు. ఉదాహరణకు ఒక ఇల్లు కొనుగోలు చేస్తే దానిమీద చెల్లించే వడ్డీ డబుల్ అవుతుంది. అయితే అప్పటికి ఇల్లు విలువ అంతా ఉంటుందన్న గ్యారెంటీ కూడా లేదు. అలాంటప్పుడు డబ్బు చేతిలో పడిన తర్వాత ఇల్లు కొనుగోలు చేయడము.. లేదా నిర్మించుకోవడం చేసుకోవాలి.
Also Read: ఒక్క ఐపీవో.. టార్గెట్ రూ.3,600 కోట్లు!
ఒక్కోసారి కొన్ని ప్రత్యేక అవసరాలకు బ్యాంకు రుణం తీసుకోవాల్సి వస్తుంది. అయితే వీటిని చెల్లించడానికి కేవలం కుటుంబ పెద్ద మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల్లో కొందరు సహాయంగా ఉండాలి. ఇలా అందరూ కలిసి ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని అరుణం తీర్చే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల ఒకరి పైనే భారం పడకుండా ఉంటుంది. ఒక రుణం తీసుకున్న సమయంలో దానిపై వడ్డీ ఎంత చెల్లిస్తున్నారో లెక్క వేసుకోండి.. ఆ వడ్డీ ఎక్కువ అవుతుంది అనుకుంటే వెంటనే అరుణాని తీర్చే ప్రయత్నం చేయాలి. లేకుంటే అసలు కంటే వడ్డీనే ఎక్కువగా చెల్లించాల్సి వచ్చి ఇతరులను లాభం చేకూర్చే విధంగా కష్టపడాల్సి వస్తుంది. ఈఎంఐ ద్వారా వస్తువులు కొనుగోలు చేసే కంటే ఎమర్జెన్సీ ఫండ్లు తయారు చేస్తూ.. డబ్బులు కూడా పెట్టి వస్తువులు కొనుగోలు చేయడం అలవాటు చేసుకోండి. అలా చేయడం ద్వారా మానసికంగా ఆందోళన ఉండదు.